తెలంగాణ

రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 1 : రాష్ట్రంలో తొలిసారిగా సిద్దిపేట నియోజకవర్గంలో గొర్రెల హాస్టల్స్ నిర్మించామని...ఇదే తరహాలో బర్రెలకు హాస్టల్స్ నిర్మించి ఆదర్శంగా నిలవాలన్నదే తన సంకల్పమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. గొర్రెలు, బర్రెల హాస్టల్స్‌కు రెండు ఉద్దేశాలు, లక్ష్యాలున్నాయని, ఈ నిర్మాణాలతో రైతులకు, గ్రామ ప్రజలకు మేలు జరగాలన్నదే ప్రధాన లక్ష్యమని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విద్యుత్ గెస్టుహౌస్‌లో సెర్ప్ డైరెక్టర్ అనంతం, డీఆర్‌డీఎ పీడీ గోపాల్‌రావు, పంచాయతీరాజ్ ఈఈ కనకరత్నం, పశుసంవర్థక శాఖ జేడీ రామ్‌జీ, సుడా డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, పశువైద్యాధికారులు, వివిధ ఇంజనీరింగ్ అధికారులు, నియోజక వర్గంలోని ప్రజాప్రతినిధులు, 8 గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని 8 గ్రామాలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని, జాతీయ స్థాయిలో ఉత్తమ పురస్కారం, అవార్డులు పొందేలా ఢిల్లీకి వెళ్లి అవార్డులు తేవాలని, అయా గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు ప్రజాభాగస్వామ్యంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా 686 జిల్లాలో మొదటి వందలో గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయని, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అభివృద్ధిలో, ఆదర్శంగా తీసుకునే అంశాలపై పోటీ ఉందన్నారు. ఆ పోటీల్లో మన సిద్దిపేట నియోజకవర్గం ఉండాలన్న ధ్యేయంగా పనిచేస్తామని కోరారు. నియోజక వర్గంలో 8 గ్రామాలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేసినట్టు తెలిపారు. వీటిలో ఇర్కోడ్, ఇబ్రహీంపూర్, గుర్రాలగొంది, మిట్టపల్లి, నర్మెట, పొన్నాల, జక్కాపూర్, గట్ల మల్యాల గ్రామాల్లో జనవరి నెలాఖరు లోపు బర్రెలకు హాస్టల్స్ నిర్మించి ఆదర్శంగా నిలపాలని మంత్రి సూచించారు. ఇప్పటికే 8 గ్రామాల్లో మూడు గ్రామాల్లో ఇబ్రహీంపూర్, నర్మెట, ఇర్కోడ్‌లో సాముహిక గొర్రెల షెడ్లు నిర్మించారన్నారు. అదేవిధంగా మిగతా గ్రామాల్లో నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఈ ప్రత్యేకమైన పథకంలో భాగంగా ఎంపిక చేసిన 8 గ్రామాల్లో మహిళా సంఘాలు క్షేత్ర స్థాయిలో భాగస్వామ్యం చేయాలని, ఈ విషయంలో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్ ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. రైతులకు గొర్రెలు అయిన, పాడిపశువులైన ఒక హాస్టల్ కట్టివేస్తే ఎండాకాలం ఫ్యాన్, వానాకాలంలో తడవకుండా రూఫ్, చలికాలంలో చలి పెట్టకుండా చుట్టూ గోడలుంటాయన్నారు. ఓపెన్ ఉన్న వైపు చిన్న టార్పాలిన్ కడితే చలి పెట్టకుండా వెచ్చగా ఉంటుందని, పశువులైన, గొర్రెలైన ప్రాణం ఉన్న జీవులేనన్నారు. మనిషి చక్కగా ఆహారం తిని చక్కగా నీడలో ఎలా ఉంటారో..జీవాలు కూడా సరిగ్గా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాయన్నారు. గ్రామంలో పశువులు, జీవాలకు వైద్యం అందించేందుకు వైద్యుడే హాస్టల్‌కు వచ్చి పరీక్షలు నిర్వహించి రికార్డులో సంతకం పెడతారన్నారు. మహిళలకు కుటీర పరిశ్రమలో భాగంగా ఇర్కోడ్‌లో చికెన్, మటన్ చట్నీలు, మిట్టపల్లిలో పప్పు దినుసులు, చిన్నగుండవెల్లిలో అల్లం పేస్ట్టు, బ్యాక్ యార్డులో పౌల్ట్రీ, మదర్ యూనిట్, నాటుకోళ్లు, పౌడరు తయారీ కేంద్రం ఇదే విధంగా ఆరు గ్రామాల్లో చేద్దామన్నారు. ప్రజాప్రతినిధుల చొరవతోనే సాధ్యమన్నారు. ఇందుకు కావాల్సిన పూర్తి సహకారం అందిస్తామని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. ఈ సమీక్షలో నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.