తెలంగాణ

పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకోరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, నవంబర్ 2: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయిన ఆర్టీసీ కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నారని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక చైర్మన్ మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ జీపీపీ డిపో వద్ద ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటించి ఆయన మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులతో బేషరతుగా కేసీఆర్ చర్చలు జరపాలని, లేనిపక్షంలో ఫాంహౌస్‌కే పరిమితం కాక తప్పదని హెచ్చరించారు. ముఖ్యంగా ఏపీలో అక్కడి సీఎం ఆర్టీసీ విలీన చర్యలు చేపట్టగా, అందుకు భిన్నంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఆర్టీసీ కార్మికుల క్షోభ సర్కార్‌కు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని, దినదినగండంగా బతుకుతున్న ఆర్టీసీ కార్మికులను ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే పెండింగ్ సమస్యల పరిష్కారంతో పాటు విలీన చర్యలు తీసుకుంటేనే సమస్య పరిష్కారమవుతుందని, పండగ పూట పస్తులున్న కార్మికుల ఆగ్రహానికి గురికాక ముందే సర్కార్ దిగి రావాలని హితవు పలికారు. కార్మికుల పట్ల కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి, అవహేళన ఫలితంగానే కార్మికులు ఆందోళనకు గురవుతూ మృత్యువాత పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రజలు అండగా నిలుస్తుండగా, తక్కువ వేతనంతో పనిచేస్తున్న వారిపై అణచివేత ధోరణి మానుకోవాలని పేర్కొన్నారు.
ఆర్టీసీ విలీనంతో పాటు 26 డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, కోర్టు సైతం మొట్టికాయలు వేస్తున్నా పట్టించుకోకపోవడం తగదని స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని చెప్పిన కేసీఆర్‌కు, జగన్మోహన్‌రెడ్డి ఏపీలో త్వరగా విలీనం చేస్తామని ప్రకటించిన మాటలు మర్చిపోవద్దని తెలిపారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఏపీ సర్కార్ అక్కడి ఆర్టీసీని రక్షించే క్రమంలో చర్యలు తీసుకుంటుండగా, మిగులు బడ్జెట్ రాష్టమ్రంటూ చెప్పిన కేసీఆర్ ఇక్కడి సంస్థకు బకాయలు ఎందుకు చెల్లించడం లేదని నిలదీశారు.