తెలంగాణ

వికసించిన బ్రహ్మ కమలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, నవంబర్ 2: సూర్యోదయంతో వికసించేది తామర పష్పం అయితే, చంద్రోదయంతో వికసించే సద్గుణం కలిగింది ఒక్క బ్రహ్మ కమలం మాత్రమే. దక్షిణ భారతదేశంలో చెరువులు, చిన్న చిన్న జలపాతాల్లో తామర పువ్వు లు కుప్పలు తెప్పలుగా పుష్పించి కనువిందు చేస్తే, అరుదుగా బ్రహ్మ కమలం వికసిస్తే ఆ కుటుంబానికి, ఇరుగుపొరుగు వారికి పట్టరాని ఆనందం కలగడం సహజమే. హిమాలయ పర్వత శ్రేణులు, ఉత్తర భారతదేశంలోని ఆయా రాష్ట్రాలు, టిబెట్, దక్షిణ చైనా ప్రాంతాల్లో కనిపించే బ్రహ్మ కమలం దక్షిణాది రాష్ట్రాల్లో రాత్రి సమయంలో మాత్రమే బ్రహ్మ కమలం మొగ్గ దశ నుండి పువ్వుగా మారుతోంది. యేడాదిలో కేవలం కార్తీక, మార్గశిరం (నవంబర్, డిసెంబర్) నెలల్లో మాత్రమే బ్రహ్మ కమలం తేజస్సుతో కనిపిస్తుందనే ప్రజల ప్రగాఢ విశ్వాసం. ప్రస్తుతం కార్తీక మాసం కొనసాగుతుండగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలోని వీరభద్రనగర్‌లో నివాసం ఉండే విశ్రాంత బీహెచ్‌ఈఎల్ ఉద్యోగి దేవయ్య, హేమలత స్వగృహంలో ఉన్న బ్రహ్మ కమలం మొక్కకు మొదటిసారిగా శుక్రవారం పువ్వు వికసించింది. యేడాది క్రితం నాటిన మొక్క ఇంతింతై పెరిగి కార్తీక మాసం వచ్చేసరికి పుష్పించే దశకు చేరుకుంది.
అన్ని పూల మొక్కలకు కాండానికి మొగ్గలు ఎదిగి పువ్వులుగా వికసిస్తే బ్రహ్మ కమలం మాత్రం ఆ తీగకు ఉండే ఆకు నుండి ఉద్భవించడం మరో విశేషం. పుష్పం వికసించగానే దేవయ్య, హేమలత దంపతులు ప్రమిదలు వెలిగించి, టెంకాయను కొట్టి పూజలు నిర్వహించి సంతోషపడ్డారు. ఈ విషయం తెలియడంతో కాలనీలోని చుట్టుప్రక్కల ఇళ్లలో నివసించే వారు సైతం వచ్చి బ్రహ్మ కమలాన్ని చూసి మొక్కుకోవడం గమనార్హం. ఇదిలావుండగా శుక్రవారం రాత్రి వికసించిన బ్రహ్మ కమలం శనివారం ఉదయానికి తిరిగి మొగ్గ దశకు చేరుకోవడంతో స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదంతా భగవంతుడు సృష్టించిన లీలగా అభివర్ణించడం ముదావహం.
*చిత్రం...సంగారెడ్డి పట్టణం వీరభద్రనగర్‌లో ఓ ఇంట్లో వికసించిన బ్రహ్మ కమలం