తెలంగాణ

సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 2: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు డీజీపీ తక్షణమే క్షమాపణ చెప్పాలని, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై పోలీసులు చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ నేతలు మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ చేపడుతున్న సంకల్పయాత్రలో భాగంగా శనివారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ డీకే అరుణ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె న్యాయబద్ధమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ భేషజాలకు పోకుండా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కానీ అలా కాకుండా ఆర్టీసీ కార్మికులు మనోవేదనకు గురయ్యేలా వ్యవహరిస్తున్నారని, సీఎం అవలంబిస్తున్న విధానాలతోనే రాష్ట్రంలో దాదాపు 15మందికి పైగా ఆర్టీసి కార్మికులు చనిపోయారని అన్నారు. కరీంనగర్‌లో ఆర్టీసీ కార్మికుడు మృతి చెందితే అక్కడి పరిస్థితులను చక్కదిద్దాల్సిన ప్రభుత్వం అక్కడ ప్రజలను రెచ్చగొట్టడం వంటి సంఘటనకు పూనుకుందని పోలీసులతో ప్రజాప్రతినిధులపై ముఖ్యమంత్రి కేసీఆర్ దాడి చేయించారని ఆరోపించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై పోలీసులు చెయ్యి చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు టీఆర్‌ఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు ఇలానే కేసీఆర్‌కు వత్తాసు పలికితే సహించేది లేదని తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎంపీ సంజయ్‌పై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు డీజీపీ సైతం క్షమాపణ చెప్పాలని అన్నారు.
మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో భయానక పరిస్థితులను కేసీఆర్ లేవనెతుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సభ్యుడిపై దాడి చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలు చెప్పడంలో దిట్ట అని ఆర్టీసీ కార్మికుల కాలుకు ముళ్లు గుచ్చుకుంటే పంటితో పీకుతానని చెప్పి కేసీఆర్ ఇప్పుడు అదే ఆర్టీసీ కార్మికుల కడుపుపై కొడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని రాజుల నాటి కాలంలా అనుకుంటున్నారని అందుకే రాష్ట్రంలో నియంత పాలనను కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేంద్ర ప్రభుత్వం సైతందృష్టి పెట్టిందని ఈ విషయాన్ని కేసీఆర్ గ్రహించాలని హితవు పలికారు. రాష్ట్రంలో పోలీసులు అతి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని కేసీఆర్ కోసం పోలీసులు ఇలా చేయాల్సిన అవసరం లేదని హితవుపలికారు. విలేఖరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎర్ర శేఖర్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి