తెలంగాణ

విలీనం ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. విలీనం చేయకూడదని మంత్రివర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రగతి భవన్‌లో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం రాత్రి 8 గంటల వరకూ కొనసాగింది. ఆ తర్వాత కేసీఆర్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వివరించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్‌ను మంత్రివర్గం తిరస్కరించిందన్నారు. ఒక్క ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే, రాష్ట్రంలో ఉన్న మరో 91 కార్పొరేషన్లు, సంస్థలు కూడా తమ విలీనం డిమాండ్‌ను తెరపైకి తెస్తాయని అన్నారు. అందువల్ల ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయకూడదంటూ మంత్రివర్గం చేసిన నిర్ణయాన్ని మార్చే అధికారం తనతో పాటు ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు.
శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీపై ప్రధానంగా చర్చించామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీ నేతృత్వంలో ప్రస్తుతం 10,400 బస్సులు నడుస్తున్నాయని, వీటిలో 5,100 బస్సులను ప్రైవేట్ రంగం నడిపేందుకు మంత్రివర్గం తీర్మానించిందన్నారు. మిగతా బస్సులు ఆర్టీసీ నడుపుతుందన్నారు. అయితే ఇప్పటికే 2,100 బస్సులు అద్దెప్రాతిపదికపై నడుస్తున్నాయని, ఆర్టీసీ నేతృత్వంలో ఉన్న బస్సులో 2,609 బస్సులు పూర్తిగా చెడిపోయాయని, మరో 400 బస్సులు రెండు, మూడు నెలల్లో పూర్తిగా చెడిపోయి, నడపలేని స్థితికి (కండెమ్న్) చేరుకుంటాయన్నారు. శిథిలావస్థలో
ఉన్న బస్సుల స్థానంలో ఆర్టీసీకి కొత్తగా బస్సులు కొనేందుకు నిధులు లేవన్నారు. అందువల్ల కండెమ్న్ అయ్యే బస్సుల స్థానంలో బస్సులను నడిపేందుకు ప్రైవేట్ వారికి అవకాశం ఇస్తామన్నారు.
సమ్మె చేస్తున్న కార్మికులపై సానుభూతితో ఒక అవకాశం ఇస్తున్నామని, సమ్మెలో ఉన్న కార్మికులంతా 2019 నవంబర్ 5 అర్థరాత్రిలోగా బేషరతుగా విధుల్లో చేరేందుకు అవకాశం ఇస్తున్నామని సీఎం తెలిపారు. ఒక వేళ చేరకపోతే ఆర్టీసీ నడపాలనుకుంటున్న 5,100 బస్సులను కూడా ప్రైవేట్ వారికే అప్పచెబుతామని, నూరు శాతం ప్రైవేటీకరణ జరుగుతుందని ఆయన హెచ్చరించారు. సమ్మె చట్టవిరుద్ధమని కార్మిక శాఖ ఇప్పటికే ప్రకటించిందని, అందువల్ల ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్టవిరుద్ధమేనని స్పష్టం చేశారు. అయితే కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డుపై పడకూడదన్న ఉద్దేశంతో ఒక అవకాశం ఇవ్వాలని మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. నవంబర్ 5 లోగా కార్మికులు చేరకపోతే, 49,000 మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని స్పష్టం చేశారు.
కార్మిక సంఘాలు ఈరోజు ప్రకటించిన కార్యాచరణ ప్రణాళిక పనికిరానిదని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ రంగానికి బస్సులు నడిపేందుకు అవకాశం ఇచ్చినప్పటికీ, బస్సు చార్జీలపై ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రైవేట్ సంస్థలు బ్లాక్‌మెయిల్ చేసి, చార్జీలు ఇష్టం వచ్చినట్టు పెంచకుంటా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. చార్జీలు తదితర అంశాలపై విధివిధానాలు రూపొందించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న విధానానే్న తాము అమలు చేస్తామన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీసీ లేదని గుర్తు చేశారు. సమ్మెకు విపక్షాలు ఇస్తున్న మద్దతును గుర్తు చేస్తూ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేయలేదని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో మంచి సంప్రదాయం ఉండాలన్న ఉద్దేశంతో 50 శాతం బస్సులను ఆర్టీసీ నేతృత్వంలో, మరో 50 శాతం బస్సులను ప్రైవేట్ రంగంలో నడపాలని నిర్ణయించామన్నారు. ఆర్థికంగా ఆదాయం లేని రూట్లనే ప్రైవేట్‌కు ఇస్తామని, బాగా ఆదాయం ఉన్న రూట్లలో ఆర్టీసీ బస్సులే నడుస్తాయన్నారు. ఎట్టిపరిస్థితిలోనూ ప్రజలకు అసౌకర్యం కలిగించబోమన్నారు. ఆర్టీసీ ప్రైవేట్ పరం అయినప్పటికీ, ప్రస్తుతం అమల్లో ఉన్న 18 రకాల బస్‌పాసులను కొనసాగిస్తామన్నారు. కార్మికలకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోకపోతే, నవంబర్ 6, 7 తేదీలలోగా స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తామని కేసీఆర్ తెలిపారు.
గత నాలుగేళ్లలో ఆర్టీసీ కార్మికులకు 67 శాతం వేతనాలు పెంచామని, 16 శాతం ఐఆర్ కూడా ఇచ్చామరి ముఖ్యమంత్రి అన్నారు. 4,760 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వం చిరుద్యోగుల పట్ల సానుభూతితో ఉందని 23 క్యాటగిరీల ఉద్యోగుల వేతనాలను పెంచామని కేసీఆర్ తెలిపారు.
కేంద్ర చట్టమే..
కేంద్రం తీసుకువచ్చిన 2019 రవాణా చట్టానికి అనుగుణంగానే ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. కొత్త చట్టానికి పార్లమెంట్ ఆమోదం తెలిపినవారిలో రాష్ట్రంలోని నలుగురు బీజేపీ ఎంపీలు, బీజేపీ కూడా బాగస్వాములే కదా అని అడిగారు. ఈ నలుగురు ఎంపీలు ఏ విధంగా సమ్మెకు మద్దతు తెలుపుతున్నారని ప్రశ్నించారు. శవాలపై పేలాలు ఏరుకుతినే చందాన విపక్షాలు వ్యవహరిస్తున్నాయని, ఒక్క ఎమ్మెల్యేను గెలిపించుకోలేని పార్టీలు కూడా సమ్మెకు మద్దతు తెలపడం శోచనీయమన్నారు. సమ్మె సమయంలో చనిపోయిన కార్మికుల గురించి ప్రస్తావిస్తూ, ఇందుకు కార్మిక సంఘాల నేతలు, విపక్షాలే బాధ్యత వహించాలన్నారు. రాష్ట్ర విభజనలోని తొమ్మిదో షెడ్యూల్‌లోకి ఏపీఎస్ ఆర్టీసి వస్తుందని, ఆస్తుల విభజన పూర్తిగా జరగలేదని, రెండు కార్పోరేషన్లు ఏర్పాటు చేసుకునేందుకు ఒప్పందం కుదిరిందన్నారు.
*చిత్రం...మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు