తెలంగాణ

పర్యావరణ పరిరక్షణకు అధ్యయనాలు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తూర్పు కనుమలు భారత వారసత్వ సంపద అని, వాటిని కాపాడుకోవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర మాజీ మంత్రి, అడవులు, పర్యావరణం, శాస్తస్రాంకేతిక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ జైరాం రమేశ్ అన్నారు. పర్యావరణ పరిరక్షణకు మరిన్ని, లోతైన అధ్యయనాలు అవసరమని అభిప్రాయపడ్డారు. గ్రీన్స్ అలియన్స్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఈస్ట్రర్న్‌ఘాట్స్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ సంస్థల సంయుక్త్ధ్వార్యంలో శనివారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో ‘ఈస్ట్రర్న్ ఘాట్స్ ఎన్విరాన్‌మెంట్ ఔట్‌లుక్’ అనే పుస్తకావిష్కరణ సభ జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన జైరాం రమేశ్ తొలుత పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సభనుద్దేశించి ఆయన మాట్లాడుతూ తూర్పు కనుమలపై సమగ్రమైన అధ్యయనం జరగాల్సిన అవసరముందని సూచించారు. పడమటి కనుమల పరిరక్షణపై అనేక అధ్యయనాలు జరిగాయని, సమగ్ర స్వరూపాలతో కూడిన నివేదికలెన్నో ఇప్పటి వరకు ప్రభుత్వానికి అందాయని వివరించారు. తూర్పు కనుమలు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్నాటకరాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణ కత్తిమీద సాములాంటిదని, అడవుల సంరక్షణకు అధికారులపై మైనింగ్, పారిశ్రామిక, రాజకీయ ఒత్తిడులు పనిచేస్తుంటాయన్నారు. ఏజన్సీలో బాక్సైట్ గనుల తవ్వకంపై గతంలో పెద్ద ఎత్తున జరిగిన ఉద్యమాన్ని ఆయన గుర్తు చేశారు. భారతదేశ భౌగోళిక, నైసర్గిక స్వరూపాలను పరిరక్షించే తూర్పు కనుమలపై స్టాండింగ్ కమిటీలో చర్చలు జరిపి, తగిన చర్యలను తీసుకుంటామని వివరించారు. హిమాలయాలు, ఆరావళి, పశ్చిమ, తూర్పు కనుమల సంరక్షణకు కేంద్రం, రాష్ట్రప్రభుత్వం ఉమ్మడిగా కృషి చేయాలన్నారు. అడవుల పరిరక్షణ మరింత ముమ్మరం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి, పకడ్బందీ ఏర్పా ట్లు చేయాలని జైరాం సూచించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ, కేంద్రమాజీ మంత్రి దివంగత ఎస్ జైపాల్ రెడ్డి పర్యావరణ పరిరక్షణకు ఎనలేని కృషి చేశారన్నారు. ప్రకృతిని సంరక్షిస్తే మనలను రక్షిస్తుందని ఇందిరాగాంధీ విశ్వసించేవారన్నారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తూర్పుకనుమల పరిస్థితులపై విస్తృత అధ్యయనం చేసి, డాక్యుమెంట్‌ను రూపొందించడం పట్ల ఆయన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ వ్యవస్థాపకులు కే. లక్ష్మారెడ్డిని అభినందించారు. సభాధ్యక్షుడు సమాచార హక్కు మాజీ కమిషనర్ ఆర్. దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ తూర్పు కనుమలను కాపాడుకునేందుకు ఇంకెన్నో అధ్యయన నివేదికలు అవసరమని, వీటి పరిరక్షంకు అన్ని వర్గాలు సమష్టి కృషితో ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. ఒరిస్సా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో విస్తరించిన ఈ తూర్పు కనుమల్లో ఎలాంటి తవ్వకాలు జరగకుండా ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాలసీ నిపుణులు మోహన్ గురుస్వామి, జీవవైవిధ్య నిపుణులు డా. కే. తులసీరాం, పర్యావరణవేత్త ప్రొఫెసర్ కే. పురుషోత్తమ్‌రెడ్డి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ ఫౌండర్ కె.లక్ష్మారెడ్డి, అధ్యక్షురాలు కే. లీలా లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...‘తూర్పు కనుమలు పర్యావరణ పరిస్థితులు’ అనే అంశంపై కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ రూపొందించిన
డాక్యుమెంట్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్