తెలంగాణ

105 కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: రాష్ట్రం లో పత్తి రైతాంగాన్ని కేంద్రం ఆదుకుంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ సహా య మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నారు. శనివారం ఇక్కడ కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అధికారులతో పత్తి కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 50 లక్షళ ఎకరాల్లో 22 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోందన్నారు. పెద్ద ఎత్తున పత్తి ఉత్పత్తి జరిగి మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు కేంద్రహోంశాఖమంత్రి అమిత్ షాకు విజ్ఞాపన పత్రాలు పంపారన్నారు. ఈ నేపథ్యంలో పత్తి పరిస్థితిపై సమీక్షిస్తున్నట్లు చెప్పారు. పత్తి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. దీనిపైన కేంద్రం చొరవ చూపాలని అమిత్‌షా వెంటనే వ్యవసాయ శాఖమంత్రికి ఆదేశించారన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో పైలెట్ మిషన్ అమలులో ఉందన్నారు. పత్తి బాగా తడిసిపోయి ఉన్నందున మరో పది రోజులు ఆరబెట్టి తీసుకురావాలన్నారు. తెలంగాణ మార్కెటింగ్ శాఖకు కాటన్ కార్పోరేషన్ అధికారు లు సహకరిస్తారన్నారు. వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించామన్నారు.కేంద్రం చివరి వరకు సీసీఐ ద్వా రా కొనుగోళ్లు జరపుతుందన్నారు. తేమను బట్టి కూడా పత్తి ధరను నిర్ణయించారన్నారు. దళారుల వద్దకు కా కుండా రైతులు నేరుగా సీసీఐ కేంద్రాల వద్ద అమ్మకాలు జరపాలన్నారు. కేం ద్రం ఆదేశాల మేరకు 105 కేంద్రాల్లో రాష్ట్రం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. 278 మార్కెట్ యార్డులను తెలంగాణ వ్యాప్తంగా నోటిఫై చేశామన్నారు. అన్ని కేంద్రాల వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉంటారన్నారు. రైతులు కాటన్‌ను డ్రై చేసుకుని వస్తే గిట్టుబాటు ధర వస్తుందన్నారు. 12 శాతం కంటే కాటన్ తేమ తక్కువ ఉండేటట్లుగా రైతులు చూసుకోవాలన్నారు. రైతులకు ఎలాంటి ఇ బ్బందులు ఉన్న సీసీఐ అధికారులు, మార్కెటింగ్ అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.
*చిత్రం...కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అధికారులతో సమీక్షిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి