తెలంగాణ

వంతెనల నిర్మాణంలో దేశానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: వంతెనల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ప్రధాన జాతీయ రహదారుల్లో వెవల్‌కాజ్‌వేలు ఎక్కువగా ఉన్నాయని వాటిని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.2,495 కోట్లను కేటాయించారని మంత్రి తెలిపారు. ఈ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 511 బ్రిడ్జిలను నిర్మిస్తున్నామని, ఇప్పటికే 400 బ్రిడ్జిల నిర్మాణం పూర్తయిందన్నారు. శనివారం ఖైరతాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్, కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (్ఢల్లీ)తో కలిసి రాష్ట్ర రుడ్లు నవనాల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో విశే్వశ్వరయ్య భవన్‌లో ఆడిటోరియంలో జరిగిన ‘హెల్త్ అసిస్‌మెంట్ ఆఫ్ బ్రిడ్జెస్ అండ్ స్ట్రక్చర్స్’ అన్న అంశంపై జరిగిన వర్క్‌షాప్‌లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. బ్రిడ్జిల నిర్మాణానికి ఇప్పటి వరకూ రూ.1700కోట్లు ఖర్చుచేసినట్టు మంత్రి పేర్కొన్నారు. కొత్త టెక్నాలజీతో బ్రిడ్జిల నిర్మాణం జరుగుతుందని, హైదరాబాద్, కరీంనగర్‌లలో కేబుల్ స్టెర్‌టెక్నాలజీతో బ్రిడ్జిల నిర్మిస్తున్నట్టు మంత్రి తెలిపారు. తెలంగాణలవని బ్రిడ్జిల నాణ్యతను ఎప్పటికపుడు తనిఖీలు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకూ రోడ్‌కనెక్టివిటీ నెట్ వర్క్ కోసం సీఎం రూ.12వేల కోట్లు కేటాయించారని తెలిపారు. రాష్ట్రంలో బ్రిడ్జిల నిర్మాణం పనులు విజయవంతంగా సాగుతున్నాయని, ఇప్పటి వరకు 400 బ్రిడ్జిల నిర్మాణం పూర్తయిందని, మిగత బ్రిడ్జిల నిర్మాణం పనులు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి వివరించారు. గోదావరి 2, మంజీరాపై, 3, మానేరుపై 4 పెద్ద బ్రిడ్జిల నిర్మాణం జరుగుతోందన్నారు. సీఎ అదేశామ మేరకు ఆర్‌అండ్ బి బ్రిడ్జిల నిర్మాణంతో పాటు చెక్‌డ్యామ్‌లు కూడా నిర్మిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కే.సిన్హా, డాక్టర్ పీఆర్.స్వరూప్, ఆర్‌అండ్‌బీ శాఖ ఈఎన్‌సీ రవీందర్ రావు, గణపతి రెడ్డి, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ సెంటర్ చైర్మన్ జీ.రామేశ్వర రావుతో పాటు ఇతర ఇంజనీర్లు పాల్గొన్నారు.