తెలంగాణ

ప్రజల హక్కులను కాలరాస్తున్న పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: రాష్ట్రంలో హక్కులు, డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసనలు తెలియచేస్తున్న సంఘాలపై రాష్ట్రప్రభుత్వం ఉక్కుపాదం మోపి అణచివేయడం దారుణమని పీసీసీ నేత మల్లు రవి ధ్వజమెత్తారు.
ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం తగదన్నారు. ప్రజాప్రతినిధవుల పట్ల దురుసుగా వ్యవహరిస్తూ, ప్రజల హక్కులను అపహరిస్తున్నారన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రజల సమస్యలపై ఎత్తి చూపే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంటుందన్నారు. నిరసన వ్యక్తం చేయడం ప్రజల హక్కు అన్నారు.
కరీంనగర్‌లో ఆర్టీసీ సమ్మె సందర్భంగా పోలీసులు ఎమ్మెల్యేలు, ఎంపీల పట్ల చాలా దురుసుగా, అప్రజాస్వామ్యంగా ప్రవర్తించారని, పాలన పోలీసుల చేతికి వెళితే అది ప్రజలకు మంచిది కాదన్నారు. హక్కులను కాలరాస్తే ఉద్యమం మరింత తీవ్రమవుతుందన్నారు. ఈ నెల 5వ తేదీన ఎఐసీసీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ హైదరాబాద్‌కు వస్తున్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా టీపీసీసీ చేపట్టే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.