తెలంగాణ

సమ్మె పరిష్కారంలో కేసీఆర్ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: తెలంగాణ వస్తే స్వేచ్ఛ ఉంటుందని భావించామని, సీఎం కేసీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆర్థిక స్థితిని ధ్వంసం చేశారని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో స్వేచ్చ ప్రధానమైదని, ఆ స్వేచ్ఛను కేసీఆర్ హరించారన్నారు. ఆర్టీసీ సమ్మెను పరిష్కరించడంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. సమగ్ర సర్వేతో వ్యక్తిగత వివరాలు సేకరించి, రాజకీయ ప్రత్యర్థుల ఫోన్‌ను టాప్ చేశారన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వం వాహనాలు ఏర్పాటు చేయలేదన్నారు. అందుకే కేంద్రం ఆర్టీసీని ఏర్పాటు చేసిందన్నారు. ఆ తర్వాత రాష్ట్రప్రభుత్వాలు ఆర్టీసీని ఏర్పాటు చేసుకున్నాయన్నారు. కేంద్రం 31 శాతం పెట్టుబడి పెట్టినా, ఎక్కడా కేంద్రం ఆజమాయిషీ చేయలేదన్నారు. కేసీఆర్ ప్రజలను తప్పుదోవబట్టిస్తున్నారన్నారు. నష్టం వచ్చినా, లాభం వచ్చినా మెజారిటీ షేర్ ఉన్న వాళ్లే భరించాలన్నారు.కేంద్రం తెచ్చిన మోటారు వాహన సవరణ చట్టంలో ప్రైవేటీకరణ చేయాలని ఎక్కడా చెప్ప8లేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా ఆర్టీసీలు నష్టాల్లో ఉన్నాయన్నారు. పేద వారి సంక్షేమం కోసం ప్రభుత్వం తప్పనిసరిగా నడపాలన్నారు. ఇంతకాలం ముఖ్యమంత్రి, మంత్రులు అవాస్తవాలు చెప్పేవారని, ప్రస్తుతం అధికారులు కూడా అసత్యాలు చెబుతున్నారన్నారు. కరీంనగర్‌లో బీజేపీ ఎంపీపై పోలీసుల దాడిని ఆయన ఖండించారు.
నేటి నుంచి మున్సిపాలిటీల పరిధిలో బీజేపీ సమావేశాలు
రానున్న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు మూడురోజుల పాటు బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని బీజేపీ ప్రకటించ్ది. ఈ సమావేశాలకు పార్టీ నియమించిన ఇన్‌చార్జీలు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు.