తెలంగాణ

ఆర్టీసీ కార్యాచరణకు ఏఐటీయూసీ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధనకు రూపొందించిన జాక్, అఖిలపక్షం రూపొందించిన కార్యాచరణకు సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, సీపీఐ రాష్టక్రార్యదర్శి చాడ వెంకటరెడ్డిలు పేర్కొన్నారు. 3వ తేదీనద అన్ని డిపోల వద్ద , గ్రామాల్లో ఆర్టీసీ అమరవీరులను స్మరిస్తూ సమావేశాలు నిర్వహించడం, 4వ తేదీన రాజకీయ పార్టీలతో డిపోల వద్ద దీక్షలు నిర్వహించడం, 5వ తేదీన సడక్‌బంద్ , రహదారుల దిగ్బంధం, 6న రాష్టవ్య్రాప్తంగా డిపోల వద్ద ధర్మా, 7న ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతో , రాజకెయ పార్టీలతో డిపోల ముందు దీక్షలు, 8న చలో ట్యాంకుబండ్ సన్నాహక కార్యక్రమాలు, 9న ట్యాంకుబండ్‌పై దీక్షలు, నిరసన కార్యక్రమాలలో భాగస్వామ్యం అవుతామని చాడ వెంకటరెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బల్దియాలో ప్రైవేటీకరణను విరమించుకోవాలని , పనిచేయడం చేతకాని మంత్రులు రాజీనామా చేయాలని ఎఐటీయూసీ ప్రధానకార్యదర్శి వీఎస్ బోస్ పేర=కన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని, జీహెచ్‌ఎంసీలో రోడ్లు, పారిశుద్ధ్యం నిర్వహణ ప్రైవేటు వారికి ఇస్తామని, విద్య, వైద్యం ప్రైవేటీకరిస్తామని చెప్పడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని, అలాంటి శాఖలకు మంత్రులు ఎందుకని ప్రశ్నించారు. రవాణా మంత్రి, పురపాలక మంత్రి, విద్యామంత్రి, వైద్య మంత్రి రాజీనామా చేయాలని అన్నారు. తెలంగాణలో ఎవరి సలహాలు,సంప్రదింపులు అవసరం లేని సీఎం ఉండగా ఇతర మంత్రులు తెలంగాణకు అవసరం లేదని ఎద్దేవా చేశారు. జీహెచ్‌ఎంసీలో రోడ్లు, పారిశుద్ధ్యం, ఫుట్‌పాత్‌ల నిర్వహణను ప్రైవేటుపరం చేస్తే అక్కడ పనిచేస్తున్న శాశ్వత కార్మికులు, కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి ఏమిటో చెప్పాలని అన్నారు. మెరుగైన జీతాలు, సౌకర్యాలు, ఉద్యోగ భద్రత వంటి అన్నింటికీ విఘాతం ఏర్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆషా కమిటీ ఏర్పాటు
తెలంగాణ వాలంటరీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ -ఆషా రాష్ట్ర అధ్యక్షురాలిగా పీ జయలక్ష్మి ఎన్నికయ్యారు.
ఉపాధ్యక్షుడిగా ఎంవీ అప్పారావు, కొండాలక్ష్మి భూపాలపల్లి, కవిత, మీన, రాజశ్రీ, సావిత్రి, విజయ ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్రధానకార్యదర్శులుగా కే సునీత, సహాయకార్యదర్శులుగా నీలాదేవి , వాణి, కే నర్సమ్మ, శోభ, సమ్మక్క, రాజమణి, పద్మ, యశోద, పూనం ఝాన్సీ, కోశాధికారిగా లలిత ఎన్నికయ్యారని అధ్యక్షురాలు పీ జయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి కే సునీత తెలిపారు.