తెలంగాణ

ఆసియాన్ ఆర్థిక ఒప్పందాన్ని వ్యతిరేకించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరుగుతున్న ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక సమావేశంలో ప్రతిపాదిస్తున్న ఆర్ధిక ఒప్పందాన్ని భారత్ వ్యతిరేకించాలని ఆలిండియాకిసాన్ సభ జాతీయ కార్యదర్శి పశ్యపద్మ డిమండ్ చేశారు. ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక ఒప్పందంపై ప్రధాని నరేంద్రమోదీ ఎట్టిపరిస్థితుల్లో సంతకం చేయరాదని ఆమె పేర్కొన్నారు. థాయిలాండ్‌లో జరిగే ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక సమావేశంలో ఆసియాన్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలు పాల్గొంటున్నాయని, ఈ సమావేశాలకు భారత ప్రధాని కూడా హాజరవుతున్నారని, ఈ ఒప్పందంపై సంతకం పెట్టవద్దని ప్రజలు రైతాంగం గత రెండు సంవత్సరాలుగా నిరంతరంగా ఉద్యమించి పోరాడుతున్నారని అన్నారు. ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక ఒప్పందం పట్ల భారత ప్రభుత్వం వైఖరి ఏమిటనే విషయాన్ని పార్లమెంటులో చర్చించి, విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించకుండా బీజేపీ నేతృత్వంలోని ఎన్టీఏ ప్రభుత్వం ఈ అంశాన్ని గోప్యంగా ఉంచిందని ఆరోపించారు. ఈ ఒప్పందం ఆచరణలో భారత రైతాంగాన్ని పూర్తిగా దెబ్బతీస్తుందని, వ్యవసాయ పంటలు, పాలు, నూనెలు, పప్పులు సర్వస్వం ఇతర దేశాల నుండి మన దేశానికి దిగుమతి అవుతాయని, మన రైతులు పండించే పంటల ధరలు దారుణంగా పడిపోయే ప్రమాదం ఉందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఒప్పందంపై సంతకం చేసే ముందు భారత ప్రజల మనోభావాలను అర్ధం చేసుకోవాలని అన్నారు. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ పిలుపునిచ్చిందని, ఈ పిలుపులో భాగంగా 4వ తేదీన రైతుల సదస్సును తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్టు ఆమె చెప్పారు.
పత్తికి మద్దతు ధర : రైతు సంఘం
ప్రస్తుతం మార్కెట్‌కు వస్తున్న పత్తికి తేమ ఉందనే పేరుతో క్వింటాలు 3వేల నుండి 3500 రూపాయిలకు మాత్రమే కొనుగోలుచేస్తున్నారని, ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర 5550 రూపాయిలు చెల్లించాలని రైతు సంఘం అధ్యక్షుడు పీ జంగారెడ్డి, కార్యదర్శి టీ సాగర్‌లు కోరారు.
రాష్ట్రంలో 46 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది పత్తి పంట వేశారని, మొదట వర్షాభావం వల్ల 15 లక్షల ఎకరాల్లో విత్తనం మొలకెత్తలేదని, మొలకెత్తిన చోట నీరు లేక ఎండిపోయిందని, తర్వాత పడిన వర్షాలకు మళ్లీ పత్తినాటారని, ఆ తర్వాత కూడా వర్షాలు లేకపోవడంతో చాలా మంది ట్యాంకర్లు ద్వారా మొక్కలను తడిపారని పేర్కొన్నారు. దీంతో రైతు ఎకరాలకు 5వేల నుండి 8 వేల రూపాయిల వరకూ అదనపు పెట్టుబడి పెట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దీంతో పత్తిమొక్క పెరిగినా, సెప్టెంబర్‌లో నిరంతరం కురిసిన వర్షాలకు వేర్లు దెబ్బతిని చెట్లు పడిపోయాయని, దాదాపు 8 లక్షల ఎకరాల్లో పత్తిపంట పూర్తిగా దెబ్బతిందని అన్నారు. ఎకరాకు మొత్తంగా చూస్తే 50 వేల నుండి 60వేల రూపాయిలు పెట్టుబడి పెట్టారని, కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా నేడు కనిపించడం లేదని వారు పేర్కొన్నారు.