తెలంగాణ

హుజూర్‌నగర్ ఫలితాలపై చంద్రబాబు సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: ఇటీవల జరిగిన హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలపై ఏపీ మాజీ సీఎం, టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు శనివారం పార్టీ నేతలతో సమీక్షించారు. హుజూర్‌నగర్ అసెంబ్లీ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి చావా కిరణ్మయికి వచ్చిన ఓట్ల శాతంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలిసింది. తెలంగాణలో అధికార పార్టీ తెరాస పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందున అదే భావనతో ఎన్నికల్లో పోటీ చేశామని పార్టీ వర్గాలు గుర్తు చేశాయి. రానున్న మన్సిపల్ ఎన్నికల్లో పార్టీ వ్యూహం ఏమిటని పార్టీ సీనియర్లతో చంద్రబాబు సమాలోచన చేశారు. కాగా, ఏపీలో మీడియాపై ఆంక్షలు తీసుకువచ్చిన అధికార పార్టీ వైకాపా పట్ల చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో మీడియాపై ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోలకు వ్యతిరేకంగా మద్దతు కావాలని చంద్రబాబు దృష్టికి ఏపీ జర్నలిస్టులు తీసుకువచ్చారు. ఇందుకు తన మద్దతు ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
*చిత్రం...
హైదరాబాద్‌లోని తెలుగుదేశం కార్యాలయంలో శనివారం పార్టీ తెలంగాణ నాయకులతో సమావేశమైన ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు