తెలంగాణ

ఎలుగుబంటి దాడి: ఒకరికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, నవంబర్ 3: నల్లగొండ జిల్లాలో ఒక వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని చందంపేట మండలం కంబాలపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున అటవీప్రాంతంలో ఉన్న గొర్రెల మంద వద్ద ఉన్న కంబాలపల్లి గ్రామానికి చెందిన గోవిందు అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయతే పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం గోవిందును మెరుగైన చికిత్స నిమిత్తం హైద్రాబాద్‌కు తరలించారు. ఈ సందర్భంగా పలువురు కంబాలపల్లి వాసులు మాట్లాడుతూ తమ గ్రామంలో ఎలుగుబంటు దాడులు నిత్యకృత్యమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలుగుబంటుల నుండి తమను కాపాడాలని అటవీశాఖ అధికారులను ఎన్నిసార్లు వేడుకున్నా ఏ మాత్రం స్పందించడం లేదని ఆరోపించారు. గతంలో తమ గ్రామానికి చెందిన ఇద్దరిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపర్చిందని ఆ సమయంలో తమకు రక్షణ కల్పించాలని అటవీశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎలుగుబంట్ల నుండి తమకు రక్షణ కల్పించాలని కంబాలపల్లి గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.