తెలంగాణ

దాహార్తి తీర్చడంలో గత ప్రభుత్వాలు విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, నవంబర్ 3: మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా, రైతుబంధు, రైతుబీమా తదితర అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను యావత్ రాష్ట్ర ప్రజలు కొనియాడుతున్నారని సంతృప్తిని వ్యక్తం చేసారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా పటన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ పురపాలక సంఘం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసారు. భీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మంత్రి హరీష్‌రావు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను అమీన్‌పూర్ పంచాయతీ పరిధిలో పర్యటించినప్పుడు మహిళలంతా ముక్తకంఠంతో గుక్కెడు మంచినీళ్లు తాగించాలని కోరారని గుర్తు చేసారు. విశాలంగా విస్తరించి ఉన్న జిల్లాలను విభజించి ప్రజల సౌలభ్యం కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు మొక్కుబడిగా కోటి రూపాయలకు మించి నిధులు మంజూరు చేయలేదని, చాలీచాలని ఆ నిధులతో తాగునీటి పథకాలను అసంపూర్తిగా కొనసాగించారని ఆవేదన వ్యక్తం చేసారు. ఒక్క అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సుమారు 85 కాలనీల ప్రజల దాహార్తి తీర్చడానికి స్వచ్ఛమైన గోదావరి జలాలను తరలించి అందిస్తున్నామని తెలిపారు. రాబోయే 20 సంవత్సరాల వరకు కూడా అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలో తాగునీటి సమస్య తలెత్తదని భరోసా ఇచ్చారు. పారిశ్రామికవాడగా విస్తరించిన పటన్‌చెరు పట్టణంలో జాతీయ రహదారిపై రోడ్డుపైనే కూరగాయల సంత కొనసాగడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తేదని, స్థానిక ఎమ్మెల్యే కృషితో దాన్ని పరిష్కరించామని చెప్పారు. తాగునీటి పథకం ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతవరణం కల్పించడానికి కృషి చేయాలని, డంపు యార్డును నిర్మించాలని అందుకు అవసరమైన నిధులను కేటాయిస్తున్నట్టు సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలో అంతర్భాగమైన పటన్‌చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని పేర్కొన్నారు. నిధుల మాంద్యం నెలకొన్నా ప్రజాప్రయోజనాలే ముఖ్యంగా భావిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ కేటాయింపులు చేయిస్తున్నారని హరీష్‌రావు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ మంజుశ్రీ, జీహెచ్‌ఎంసీ జల మండలి ఎండీ దానకిషోర్, కలెక్టర్ హన్మంతరావు, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...సంగారెడ్డి జిల్లా పటన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ మండలం భీరంగూడలో
ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతున్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు