తెలంగాణ

నిలకడగానే ఆర్టీసీ డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, నవంబర్ 3: ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక, న్యాయమైన సమస్యల సాధన కోసం చేపట్టిన సమ్మె కొలిక్కి రాక త్రీవ మనస్థాపనికి గురై అత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసి డ్రైవర్ కల్వకొలు శ్రీశైలం అరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. రంగారెడ్డి జిల్లా ఫలక్‌నుమా ఆర్టీసి డిపోలో పది సంవత్సరాలుగా డ్రైవర్‌గా పనిచేస్తున్న నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన కల్వకొలు శ్రీశైలం శనివారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇతడిని చికిత్స నిమిత్తం హైద్రాబాద్‌కు హూటాహూటిన తరలించారు. ప్రస్తుతం శ్రీశైలం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని సోదరుడు మహేష్ తెలిపారు.
*చిత్రం...ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆర్టీసీ డ్రైవర్ శ్రీశైలం