తెలంగాణ

టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే హామీల అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, నవంబర్ 3: ఇచ్చిన హామీలను అమలుచేసింది టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలోనేనని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడారు. 70 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను ఏ ఒక్క ప్రభుత్వం అమలు చేయలేదని, ప్రజా సంక్షేమం గురించి పట్టించుకున్న పాపానపోలేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందని అన్నారు. ఒకవైపు అభివృద్ధిని పరుగులుపెట్టిస్తూనే మరోవైపు సంక్షేమ పథకాలను అమలుపరచిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్ రూపొందించి అమలుపరిచారన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపరచిన ఘనత కేసీఆర్‌కు దక్కిందన్నారు. జరుగుతున్న అభివృద్ధిపై అమలవుతున్న సంక్షేమ పథకాలపై బహిరంగ చర్చకు ఎప్పుడూ సిద్ధమేనని మంత్రి జగదీష్‌రెడ్డి విపక్షాలకు సవాల్ విసిరారు. విపక్షాల విమర్శలు హేతుబద్ధంగా అధికార పార్టీకి సూచనలందించే విధంగా ఉండాలని ఆయన అన్నారు. అయతే విపక్షాల విమర్శలునోటి దురుసుతనానికి అద్దం పట్టేలా ఉన్నాయని ఆయన విమర్శించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు హుజూర్‌నగర్ ఫలితమే ప్రజలిచ్చిన కితాబు అని అన్నారు. స్థానిక శాసన సభ్యుడు బొల్లం మల్లయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ ఎంపీపీ చింతా కవిత, సూర్యాపేట జిల్లా జాయింట్ కలెక్టర్ సంజీవ్‌రెడ్డి, స్థానిక ఆర్డీవో కిషోర్‌బాబు, మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఆయన కోదాడ మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

*చిత్రం...కోదాడలో ఆదివారం జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి