తెలంగాణ

విధుల్లోకి కార్మికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరిలో మార్పు లేకపోగా విధుల్లో చేరడానికి మరో అవకాశం కల్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో అక్కడక్కడ స్పందన కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం పలు జిల్లాల్లో విధుల్లో చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తూ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతో పాటు వివిధ కేడర్లకు చెందిన ఉద్యోగులు ముం దుకు వచ్చారు. ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లో చేరడానికి మంగళవారం అర్ధరాత్రి వరకు గడువు విధించిన విషయం తెలిసిందే. గడువు ముగిసే
చివరి రోజు నాటికి విధుల్లో చేరడానికి పెద్ద సంఖ్యలోనే కార్మికులు ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు ఆర్టీసీ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఇలా ఉండగా ముఖ్యమంత్రి పిలుపుతో విధుల్లో చేరడానికి ముందుకొచ్చే కార్మికులకు ఆందోళనకారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా వారికి రక్షణ కల్పించాల్సిందిగా అన్ని జిల్లాల పోలీసులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఆర్టీసీ డిపోల ఎదుట ఆదివారం ఉదయం నుంచి పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది. సీఎం పిలుపుతో మేడ్చల్ జిల్లా ఉప్పల్ డిపోకు చెందిన అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్) కేశవ కృష్ణ ఆదివారం డిపో మేనేజర్‌కు విధుల్లో చేరనున్నట్టు సమ్మతి పత్రాన్ని అందజేసినట్టు ఆర్టీసీ వెల్లడించింది. అలాగే కామారెడ్డి డిపోకు చెందిన డ్రైవర్ సయ్యద్ హైమద్, సిద్దిపేట డిపోకు చెందిన కండక్టర్ పీ బాల విశే్వశ్వర్‌రావు, భద్రాచలం డిపోకు చెందిన కార్మికుడు శేషాద్రి, సిరిసిల్ల డిపోకు చెందిన మెకానిక్ కే శ్రీనివాస్, హయత్‌నగర్ డిపోకు చెందిన డ్రైవర్ గౌస్, మిర్యాలగూడ డిపోకు చెందిన కండక్టర్ ఎస్‌కే వలీ తదితర కార్మికులు విధుల్లో చేరుతామని సమ్మతి పత్రాలు అందజేసినట్టు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. ఆదివారం సెలవు దినం కావడంతో విధుల్లో చేరడానికి ముందుకు వచ్చే వారి సంఖ్య సోమవారం నుంచి పెరిగే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు.
*చిత్రం... సమ్మె విరమించి విధుల్లో చేరుతున్న ఉప్పల్ డిపో అసిస్టెంట్ మేనేజర్ కేశవ్ కృష్ణ