తెలంగాణ

రక్షణ పూచీ మాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గత కొంతకాలంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఈనెల 5వ తేదీలోపు విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. సీఎం పిలుపు నేపథ్యంలో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధుల్లోని పలు డిపోల్లో కొందరు కార్మికులు విధుల్లో చేరేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. అయితే, విధుల్లో చేరిన కార్మికులకు రక్షణ కల్పిస్తామని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు భరోసా ఇచ్చారు. కార్మికులు విధుల్లో చేరవచ్చునని, వీరిని ఇబ్బందులకు గురిచేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్లు మహేశ్ భగవత్, సజ్జన్నార్, అంజనీ కుమార్ వేర్వేరు ప్రకటనలలో తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం చట్టరీత్యా నేరమన్నారు. విధుల్లో చేరేవారికి పూర్తి భద్రత కల్పిస్తామని కమిషనర్లు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పిలుపు మేరకు కార్మికులు నిర్భయంగా విధుల్లో చేరవచ్చని పేర్కొన్నారు.