తెలంగాణ

2018లో 1.62 లక్షల రొమ్ము కేన్సర్ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: రొమ్ము కేన్సర్ అనేది ప్రాణాంతకమైన కణితి అని దేశంలోమహిళల్లో సంభివస్తున్నట్లు వంటి అన్ని రకాల కేన్సర్లలో దాదాపు 14 శాతంగా ఉంటూ అగ్రభాగంగా ఉందని ప్రముఖ కేన్సర్ నిపుణులు డాక్టర్ టీపీఎస్ భండారీ అన్నారు. మొత్తం మీద పతి 28 మంది మహిళల్లో ఒకరికి తమ జీవింలో ఏదో ఒక సమయంలో రొమ్ము కేన్సర్ బారిన పడే అవకాశం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 60 మందిలో ఒకరు ఈ వ్యాధితో బాధపడుతుండగా, అదే పట్టణ ప్రాంతాల్లో పోల్చి చూసినట్లయితే, ప్రతి 22 మందిలో ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారన్నారు. 2008లో దేశంలో పట్టణాల్లో 1.15 లక్షల కేసులు, 2018లో 1.62 లక్షలు నమోదయ్యాయన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత శారీరక బరువును నిర్వహించుకోవడం, పొగత్రాగడాన్ని మానివేయడం, అతిగామద్యపానం చేయడాన్ని నిరోధించడం, చనుబాలు ఇవ్వడం వంటి జీవన శైలి మార్పులను చేపట్టినట్లయితే రొమ్ము కేన్సర్ రాకుండా నివారించవచ్చన్నారు. 40 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత ప్రతి మహిళ మమోగ్రామ్ పరీక్షను చేయించుకోవాలన్నారు.