తెలంగాణ

ఆర్టీసీపై కేసీఆర్‌కు హక్కు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: ఆర్టీసీ కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న కార్మికులు విధుల్లో చేరాలంటూ డెడ్‌లైన్ విధించడం అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు. ప్రైవేటు, కాంట్రాక్టు సంస్థలతో సీఎం కుదర్చుకున్న అక్రమ ఒప్పందాల వల్లే కార్మికులను అణచివేస్తున్నారని ఆరోపించారు. కార్మికులు ఆంత్మహత్యలు , ఆందోళనతో గుండెపోటు మరణాలు సంభవిస్తున్నప్పటికీ కేసీఆర్‌లో చలనం లేదని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయాలంటూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న కేసీఆర్ మంత్రివర్గ నిర్ణయంగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు.