తెలంగాణ

ఆర్థికాభివృద్ధికి పక్కా ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: ఆర్థికంగా ఎదిగేందుకు పక్కా ప్రణాళిక అవసరమని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్-చైర్మన్ బి. వినోద్‌కుమార్ పేర్కొన్నారు. కొలంబియా యూనివర్సిటీలో జరుగుతున్న ‘సమ్మిట్ ఆన్ ఇండియన్ ఎకనమిక్స్’ చర్చాగోష్టిలో ఆదివారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వమైనా, సంస్థలైనా, వ్యక్తులైనా ఇదే సూత్రం వర్తిస్తుందన్నారు. ఆర్థికాంశాలు అంతర్జాతీయంగా పెనుసవాల్‌గా మారాయన్నారు. సమాజంలో మనుగడ సాధించాలంటే ఆర్థికాంశాలే ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. పోటీతత్వం అలవర్చుకుని, వ్యూహ రచనతో ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో జాతీయ, అంతర్జాతీయంగా పేరుపొందిన ఆర్థికవేత్తలు ప్రసంగించారు.