తెలంగాణ

సమ్మె టగ్ ఆఫ్ వార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభుత్వానికి-ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య ‘టగ్ ఆఫ్ వార్’గా మారింది. ఇటు ప్రభుత్వం కాని, అటు కార్మిక సంఘాల నేతలు కాని పట్టు సడలించడం లేదు. రెండు వర్గాలు కూడా ‘ఎత్తుకు పైఎత్తు’ వేస్తున్నారు. దాంతో సమ్మె ప్రారంభం రోజు ఎలాంటి పరిస్థితి ఉందో నేటికీ అదే పరిస్థితి నెలకొని ఉంది. ఈ నెల 5 వ తేదీ అర్థరాత్రిలోగా కార్మికులంతా సమ్మె మానుకుని విధుల్లో చేరాలంటూ ప్రభుత్వం అల్టిమేటం ఇవ్వగా, అదే సమయంలో సమ్మెను ఉధృతం చేస్తూ ఈ నెల 9 వరకు చేయాల్సిన కార్యక్రమాల వివరాలను కార్మిక సంఘాల నేతలు వెల్లడించారు. దాంతో పరిస్థితి మరింత దిగజారింది. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడం చట్టవిరుద్దమని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినప్పటికీ కార్మికులు భయపడకుండా సమ్మె కొనసాగిస్తున్నారు. ‘సామ, దాన, బేధ, దండో’పాయాల్లో తొలి నుండి చివరి రెండు అంశాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఎక్కడైనా సమస్య ఏర్పడితే, కార్మికులు, ఉద్యోగులు ఆందోళన చేస్తే తొలుత నచ్చచెప్పడం, చర్చించడం, బెదిరించడం, శిక్షించడం అనేవాటిని వరుసగా ప్రభుత్వాలు ఉపయోగిస్తుంటాయి. ప్రభుత్వం మొదటి రెండిండింటికీ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా నేరుగా బెదిరించి సమ్మెను మాన్పించాలనే ప్రయత్నిస్తోంది. సమ్మె ప్రారంభమై 29 రోజులు కావస్తున్నప్పటికీ ఇరువర్గాల మధ్య సామరస్యపూర్వక చర్చలు జరగలేదు. హైకోర్టు ఆదేశాలమేరకు ఆర్టీసీ కార్మికులతో మేనేజ్‌మెంట్ ఇటీవల చర్చలు జరిపినప్పటికీ, అవి సత్ఫలితాలు ఇవ్వలేదు. నిర్బందకాండ మధ్య చర్చల ప్రక్రియ చేపట్టారని, స్వేచ్ఛాయుత వాతావరణం ఏర్పాటు చేయకుండా చర్చలు జరపడం వల్ల తమ డిమాండ్లపై సమగ్రంగా చర్చ జరగలేదని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. రాష్ట్రంలోని కార్పోరేషన్లలో ఆర్టీసీ ప్రధానమైన సంస్థ అయినప్పటికీ, దీనికి చైర్మన్ (చైర్‌పర్సన్) కానీ, పూర్తిస్థాయి మేనేజింగ్ డైరెక్టర్ కానీ లేరు. దాంతో పరిపాలనాపరమైన అంశాలపై, కీలక సమయాల్లో నిర్ణయాలు తీసుకోలేని దుస్థితిలో ఆర్టీసీ ఉంది. 10 వేలకు పైగా బస్సులు ఉండి, 13 వేలపైగా గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పిస్తున్న ఆర్టీసీకి కీలకమైన పోస్టుల్లో పూర్తిస్థాయి అధికార యంత్రాంగం లేకపోవడం పెద్దలోటుగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మకు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను ఇటీవలే అదనంగా ప్రభుత్వం అప్పగించింది. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో ప్రభుత్వమే విపత్కల పరిస్థితిలో నేరుగా స్పందించాల్సి వస్తోంది. సమ్మెకు దిగిన కార్మికులు చేస్తున్న డిమాండ్లలో ప్రధానమైన ప్రభుత్వంలో ఆర్టీసీ ‘విలీనం’ డిమాండ్‌కు కుదరదని స్పష్టం చేస్తున్న ప్రభుత్వం మిగతా డిమాండ్లన్నీ పనికిరానివాంటూ కొట్టిపారేశారు. సమ్మెపై హైకోర్టులో కూడా విచారణ జరుగుతోంది. ఈ నెల 7 న తదుపరి విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. నవంబర్ 6 లేదా 7 వ తేదీల్లో ప్రభుత్వం ఆర్టీసీకి సంబంధించి కీలకమైన విధాన నిర్ణయం ప్రకటించే అవకాశ ఉంది. కార్మిక సంఘాలు కూడా ఇదే సమయంలో తమ ఆందోళనను ఉధృతం చేయాలని నిర్ణయించారు. అందరి మధ్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సరైన రవాణా సౌకర్యం లేకుండా ఇక్కట్లకు గురవుతున్నారు.