తెలంగాణ

డిమాండ్లను పరిష్కరిస్తే యూనియన్లు రద్దు చేసుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మీడియా సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై మాట్లాడిన విధానం కార్మికుల ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా ఉందని జెఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం హైదారాబాద్‌లో జెఏసీ నేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు నాబిడ్డలు అంటూ సీఎం మొసలి కన్నీరు కార్చుతున్నారని వారు ఎద్దేవ చేశారు. నిజంగా కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే సీఎం భేషరతుగా తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తే తాము తమ యూనియన్లను రద్దు చేసుకుంటామని ఆయన నొక్కి చెప్పారు. కార్మికులు ఉద్యోగాలు పోతాయని భయాందోళన చెందవద్దని ఆయన హితవు పలికారు. డిమాండ్లు సాధించే వరకు సమ్మె ఆగదని స్పష్టం చేశారు. సమ్మెను మరింత బలోపేతం చేయడానికి కార్యాచరణ ప్రణాళికను ముందకు తీసుకుపోవడానికి కార్మికులు వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈనెల 7న రహదార్ల నిర్బంధం కార్యక్రమం ఉంటుందన్నారు. ట్యాంక్‌బండ్‌పై వేలాది మందితో దీక్షలు చేపడతామన్నారు. కనీసం తమ పోరాటాలతో నైనా సీఎం తన నిర్ణయాన్ని మార్చుకుంటారేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు.