తెలంగాణ

సంఘటనపై సీఎంఓ ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని సజీవ దహనం చేసిన ఘటన రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రగతిభవన్‌లో ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్న సమయంలోనే ఈ ఘటనపై సీఎంవోకు సమాచారం అందింది. ఈమేరకు రెవెన్యూ, పోలీసు అధికారులకు సీఎంఓ అధికారులు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సీఎంవో అధికారులు ఫోన్ మాట్లాడి వివరాలు చెప్పారు. కాగా, తహశీల్దార్ విజయారెడ్డి హత్య పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనలో నేరస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం అత్యంత హేయమైన చర్యగా ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఖండించారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిందితునిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇలాఉండగా మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ వేర్వేరు ప్రకటనల్లో తహశీల్దార్ హత్యను తీవ్రంగా ఖండించారు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ఈ ఘటనను కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా వేర్వేరు ప్రకటనల్లో తీవ్రంగా ఖండించారు.
*చిత్రాలు.. భర్త, పిల్లలతో తహశీల్దార్ విజయారెడ్డి (ఫైల్‌ఫొటో)
*సంఘటన జరిగిన తహశీల్దార్ కార్యాలయం