తెలంగాణ

విచారణ వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ దారుణ హత్యపై విచారణ వేగవంతం చేస్తామని, డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించి నిందితుడికి శిక్షపడేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. పట్టపగలే ఒక మహిళా ఉద్యోగినిని క్రూరంగా హత్య
చేయడం అత్యంత హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. తహశీల్దార్‌ను సజీవ దహనం చేసిన వ్యక్తిని సురేశ్‌గా గుర్తించామని, ప్రస్తుతం అతను హయత్‌నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అన్నారు. నిందితుడు ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనే దానిపై ఆరా తీస్తున్నామని డీజీపీ తెలిపారు. విచారణను వేగవంతంగా నిర్వహించి నిందితుడికి శిక్షపడేలా అన్ని అధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. తహశీల్దార్ విజయారెడ్డి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపిన డీజీపీ ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటన స్థలిని పోలీసులు తన ఆధీనంలోకి తీసుకుని ఆధారాలు సేకరించారు.

*చిత్రం... డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి