తెలంగాణ

నేటి అర్ధరాత్రే డెడ్‌లైన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: ఆర్టీసీ కార్మికులు మంగళవారం అర్ధరాత్రి లోగా విధుల్లో చేరకుంటే ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ వారిని ఉద్యోగంలో చేర్చుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం విధించిన గడువులోగా విధుల్లో చేరకుంటే ఆ తెల్లారో, మర్నాడో మిగిలిన 5 వేల రూట్లను కూడా ప్రైవేట్ వాహనాలకు పర్మిట్లు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మె, హైకోర్టులో విచారణ నేపథ్యంలో ప్రగతిభవన్‌లో సోమవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. మంగళవారం అర్ధరాత్రిలోగా విధుల్లో చేరడానికి గడువు ఇవ్వడం ద్వారా కార్మికులకు మంచి అవకాశం ఇచ్చిందని, దానిని ఉపయోగించుకొని ఉద్యోగాలు కాపాడుకోవడమా? వినియోగించుకోకుండా ఉద్యోగాలు కోల్పోయి, కుటుంబాన్ని కూడా ఇబ్బందులపాలు చేయడమా? అనేది కార్మికులే తేల్చుకోవాలని ప్రభుత్వం హెచ్చరించింది. గడువులోగా కార్మికులు విధుల్లో చేరకుంటే మిగిలిన ఐదు వేల రూట్లలో కూడా ప్రైవేట్ వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని, అప్పుడు తెలంగాణలో ఆర్టీసీయే ఉండదని స్పష్టం చేసింది. కార్మికుల భవిష్యత్, కార్మికుల కుటుంబాల భవిష్యత్ ఇప్పుడు ఎవరి చేతుల్లోనూ లేదన్నారు. ఉద్యోగాలను కాపాడుకోవడం పూర్తిగా కార్మికుల చేతుల్లోనే ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని కార్మిక శాఖ ఇప్పటికే నివేదిక ఇచ్చిందని గుర్తు చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం మానవతా ధృక్పథంతో వ్యవహరించిందని పేర్కొంది. విధుల్లో చేరడానికి మూడు రోజుల గడువు ఇచ్చిందని, ఆ అవకాశాన్ని వినియోగించుకోకుంటే అర్థమే లేదని
తెలిపింది. మంగళవారం అర్ధరాత్రి గడువు ముగిశాక ఏ ఒక్క కార్మికుడిని విధుల్లో చేర్చుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వం కరాఖండీగా తేల్చిచెప్పింది. ఈ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడి ఉందని తెలిపింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని అమలు చేయడంలో కఠినంగానే వ్యవహరిస్తుందని, కనుక ఈ సదవకాశాన్ని వినియోగించుకోకపోతే తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ రహిత రాష్ట్రంగా మారుతుందని, దీనికి ముమ్మాటికీ కార్మికులే కారణం అవుతారని ప్రభుత్వం హెచ్చరించింది.