తెలంగాణ

విదేశీ భాషల అధ్యయనానికి కోర్సు మెటీరియల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: ప్రపంచంలోని 13 విదేశీ భాషల అధ్యయనానికి అవసరమైన కోర్సు మెటీరియల్‌ను రూపొందించామని ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్ ఈ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. ఈ మెటీరియల్‌ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని చెప్పారు. జపాన్ లాంగ్వేజి ఎడ్యుకేషన్ ఇన్ సౌత్ ఏషియా అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన సందర్భంగా సురేష్‌కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి జపాన్ కాన్సల్ జనరల్ కొజిరో ఉచియమ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ గత ఫిబ్రవరిలో డైమండ్‌జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ సదస్సులో దేశ విదేశాల నుండి ఫ్యాకల్టీ, పరిశోధక విద్యార్థులు పాల్గొంటున్నారని అన్నారు. జపాన్ భాష నేర్చుకోవడం వల్ల అటు విద్యాపరంగా, ఇటు ఉద్యోగపరంగా చాలా అవకాశాలున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ తమకు వచ్చిన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవాలని అన్నారు, జీవితంలో ప్రతికూలతలను అధిగమిస్తూ విద్య, బోధనపై దృష్టిని కేంద్రీకరిస్తూ సమాజం కోసం ఎంతో కొంత సేవ చేయాలని అన్నారు.
ఇఫ్లూ దేశంలోనే మొట్టమొదటిసారిగా యూనివర్శిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సమాజానికి ఇఫ్లూ తరఫున కొంత సేవ చేయాలని కోర్సు మెటీరియల్‌ను రూపొందించిందని అన్నారు. త్వరలోనే ఎడ్యుకేషన్ ఇన్ జపనీస్ లాంగ్వేజ్ బేసిక్ కోర్సును ప్రారంభిస్తామని అన్నారు.