తెలంగాణ

విధుల్లో చేరుతున్న కార్మికుల సమాచారంపై గోప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: ఆర్టీసీ కార్మికులు బేషరతుగా విధుల్లో చేరాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మంగళవారం అర్ధరాత్రితో ముగుస్తుంది. విధుల్లో చేరిన కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చెప్పడంతో రాష్టవ్య్రాప్తంగా పలు డిపోల్లో కార్మికులు విధుల్లో చేరడానికి సిద్ధం అవుతున్నారు. కార్మికులు విధులకు సిద్ధం అవుతుండడంతో జేఏసీ నేతల్లో నైరాశ్యం నెలకొంది. కార్మికులు సమ్మె నుంచి తప్పుకుంటారేమోనని జేఏసీ నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు. గత రెండు రోజుల్లో కార్మికులు విధుల్లో చేరిన సంఖ్య తక్కువగా ఉన్నా మంగళవారం ఎక్కువ మంది విధుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతుందని ఆర్టీసీ యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే విధుల్లో చేరిన కార్మికులను మళ్ళీ సమ్మెలోకి తీసుకురావడానికి జేఏసీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని మొత్తం 97 బస్ డిపోల్లో సమ్మెలో ఉన్న కార్మికుల అభిప్రాయాలను తీసుకుంటామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాకు తెలిపారు.
సోమవారం హైదరాబాద్ విద్యానగర్‌లో జేఏసీ నేతలు సమ్మెపై అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. విధుల్లో చేరుతున్న కార్మికులు మనోధైర్యం కోల్పోతున్నారని, అందుకు ఉద్యోగ భద్రతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.ప్రభుత్వం జేఏసీపై లేనిపోని ఆరోపణలు చేయడంతో కార్మికులు సందిగ్ధంలో పడ్డారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 7న హైకోర్టు ఇవ్వబోయే తీర్పు కార్మికుల పక్షాన ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నివేదికలను హైకోర్టు తప్పుపట్టిందని, వాటిని సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం నానాతంటాలు పడుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని డిపోల కార్మికుల అభిప్రాయాలను ఈనెల 7న హైకోర్టుకు సమర్పించనున్నామని ఆయన చెప్పారు. ఇదిలావుండగా, విధుల్లో చేరుతున్న కార్మికులను తిరిగి సమ్మె వైపు జేఏసీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను ఆర్టీసీ అధికారులు అడ్డుకుంటున్నారు. దీంతో గత రెండు రోజుల్లో విధుల్లో చేరిన కార్మికుల వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు.
విధుల్లోకి చేరడానికి కార్మికులు వస్తారేమోనని జేఏసీ నేతలు ఒకవైపు, వచ్చిన కార్మికులకు భద్రత కల్పించడానికి అధికారులు మరోవైపు బస్ డిపోల వద్ద ఇరువర్గాలు మోహరించారు. మరోపక్క సమ్మెలో భాగంగా 97 బస్ డిపోల వద్ద జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నిరసనలు చేపట్టారు. కరీంనగర్ జిల్లాలో బస్ డిపోల వద్ద కార్మికులు, పోలీసుల మధ్య వాగ్వాదాలు జరిగాయి. మరికొన్ని జిల్లాల్లో కార్మికులు కుటుంబాలతో ధర్నాలకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.