తెలంగాణ

డెడ్‌లైన్‌లు సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: ఏకపక్షంగా , నిరంకుశంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తూ, ఐదోతేదీలోగా చేరాలని డెడ్‌లైన్ పెట్టడాన్ని సీపీఐ ఎంఎల్ న్యూ డెముక్రసీ , తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండిస్తోందని సహాయ కార్యదర్శి పీ రంగారావు పేర్కొన్నారు. సీఎంది దురహంకార చర్య అని ,కార్మిక వ్యతిరేక చర్య అని అన్నారు. 30 రోజుల్లోగా సమ్మెలో ఉన్న కార్మికులతో కార్మిక యూనియన్లతో కనీస ప్రజాస్వామ్యయుతంగా చర్చించకుండా ప్రభుత్వం యూనియన్లనే గుర్తించకుండా వ్యవహరించే పద్ధతి నియంతృత్వమని , కార్మికుల ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టడమేనని అన్నారు.
క్యాబినెట్ ఏకగ్రీవ నిర్ణయంగా చెప్పడం అంటే క్యాబినెట్‌ను కూడా కేసీఆర్ నియంతృత్వానికి తందానా అనిపిస్తున్నారని ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. కార్మికులు కేసీఆర్ డెడ్‌లైన్‌ను అంగీకరించమని చెప్పడం సమ్మె ఐక్యతకు చిహ్నమని, కార్మికులు తమ సమ్మెను గౌరవప్రదంగా విరమించడానికే పూనుకోవాలే తప్ప, ప్రభుత్వ బెదిరింపులకు, బ్లాక్ మెయిలింగ్‌కూ ఎట్టిపరిస్థితుల్లో లొంగవద్దని ఆయన కోరారు. కార్మికుల ధృడంగా తమ ఉద్యమాన్ని కొనసాగించాలని అన్నారు. ప్రభుత్వం యూనియన్లను, మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలను ఎద్దేవా చేయడం అంటే సూర్యుడి మీద కోపగించుకోవడమేని, కార్మిక వర్గం ఐక్యతను ప్రదర్శించి ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని, ప్రభుత్వ కార్మిక వ్యతిరేక ధోరణికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.
కేసీఆర్ సొత్తా?
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు దురదృష్టకరమని సీపీఐ నేత నారాయణ పేర్కొన్నారు. సమ్మె అనైతికం అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా చెబుతారని నారాయణ ప్రశ్నించారు. ప్రైవేటు బస్సులకు రక్షణ కల్పించాలంటే ఆర్మీని తెచ్చుకోవల్సి ఉంటుందని అన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరించడం కేసీఆర్ అబ్బ సొత్తా అని ప్రశ్నించారు. పిచ్చోడి చేతిలో రాయిలా కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని నారాయణ విమర్శించారు.