తెలంగాణ

తహశీల్దార్ సజీవ దహన ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం అత్యంత దురదృష్టకరమని వామపక్ష పార్టీల నేతలు, విద్యార్ధి, యువజన సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొన్నారు. వివిధ సంఘాల నేతలు వేర్వేరుగా విడుదల చేసిన వివిధ ప్రకటనల్లో విజయారెడ్డిపై దాడి , సజీవదహనం చాలా దారుణమని పేర్కొన్నారు. ప్రజలు ఏదైనా సమస్య ఉంటే సంబంధిత అధికారి ఆ పనిచేయని పక్షంలో పై అధికారుల దృష్టికి తీసుకుదపోవాలని, అధికారులు వేధించిన పక్షంలో నిరసన వ్యక్తం చేయడానికి అనేక పద్ధతులున్నాయని, అధికారి ప్రాణాలు తీయడం సరికాదని వారు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ప్రేరణతో జరిగిన హత్యేనని అన్నారు. ముందస్తు పథకం ప్రకారంమే జరిగిందని, భూ లావాదేవీలపై అక్రమ బదలాయింపు పథకమే పేదరైతు కడుపుమంటతో రెవిన్యూ అధికారిని తగులబెట్టాడని, ఇది ఘోరమైన తప్పిదమని నారాయణ అన్నారు. అయితే ఈ ఘాతుకానికి రాష్ట్ర ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని అన్నారు.
కాగా వేరొక ప్రకటనలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తహసీల్దార్ హత్య చాలా దారుణమని అని పేర్కొన్నారు. పట్టపగలే కార్యాలయంలోనే పెట్రోలు పోసి సజీవదహనం చేయడాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఇది అత్యంత దుర్మార్గమని అన్నారు. భూ వివాదాల పరిష్కారం కోసం ఇలాంటి దారుణానికి పూనుకోవడం హేయమైన చర్య అని, తక్షణమే ఈ ఘటనపై విచారణ జరిపించాలని, నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని, తహసీల్దార్‌ను కాపాడే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడిన సిబ్బందికి మెరుగైన వైద్య సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్‌లో ఉద్యోగులపై ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరారు.
తహసీల్దార్ మరణానికి ఆయన సంతాపం తెలిపారు. ఎమ్మార్వోపై దాడి దారుణమైన చర్య అని ఎఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా అధికారిపై ఇలాంటి దాడి చేయడం అమానవీయ చర్య అని అన్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులకు రక్షణ లేకపోవడం, రాష్ట్రంలో శాంతి భధ్రతల పరిస్థితిని బయటపెడుతోందని చెప్పారు.