తెలంగాణ

సీఎంగా కేసీఆర్ అన్‌ఫిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి, సమ్మె ఉద్ధృతం అయ్యేందుకు సీఎం కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనుగుల రాకేష్‌రెడ్డి ఆరోపించారు. ఆర్టీసీని మూసేస్తామని అందుకు కేంద్రం చట్టం చేసిందని అంటున్నారని, సీఎం అవాస్తవాలు చెబుతున్నారని అన్నారు. కేంద్ర చట్టంలో ఆర్టీసీని మూసివేయాలని లేదా కార్మికులను తొలగించాలని ఏమీ లేదని పేర్కొన్నారు. 1988 మోటారువాహనాల చట్టంలోనూ, తాజా సవరణ చట్టంలో కూడా ప్రైవేటీకరణకు అవకాశం ఉందని, తాము కొత్తగా తెచ్చినా చట్టంలో ప్రైవేటీకరణను తాము చేర్చలేదని అన్నారు. గతంలోనే ప్రైవేటీకరణ అంశం ఉందని, అందుకే చాలా రాష్ట్రాల్లో ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయని పేర్కొన్నారు. 2019 చట్టం కంటే ముందే వచ్చిన చట్టాల్లో ఉన్న వెసులుబాటుతోనే ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయని అన్నారు. ప్రజలను ఘోరంగా తప్పుదారిపట్టించే ప్రయత్నం సీఎం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ అన్‌ఫిట్ అని పేర్కొన్నారు. జీతాలు ఇవ్వడం లేదని, ఎండీని నియమించలేదని, బోర్డును నియమించాలని తాము అడుగుతుంటే సీఎం మాత్రం ప్రతి రోజూ ప్రైవేటీకరణ గురించి మాట్లాడుతున్నారని , సీఎం రోజరోజుకూ దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. నష్టాలు వస్తున్న రూట్లను ప్రైవేటుకు అప్పగిస్తామని చెబుతున్నారని, నష్టాలు వచ్చే రూట్లను ప్రైవేటు వ్యక్తులు ఎందుకు ఎందుకు తీసుకుంటారని నిలదీశారు. ప్రైవేటు బస్సులు వచ్చిన తర్వాత బస్సు చార్జీలను పెంచబోమని ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందా అని ప్రశ్నించారు. సీఎం దృష్టి అంతా ఆర్టీసీ ఆస్తులపైనే ఉందని అన్నారు.