తెలంగాణ

తెలంగాణకు గొప్ప వరం నీటిపారుదల ప్రాజెక్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు రాష్ట్రానికి గొప్పవరమని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్-చైర్మన్ బి. వినోద్‌కుమార్ పేర్కొన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ ఎన్నారైలు సోమవారం ఏర్పాటు చేసిన ‘వైబ్రెంట్ తెలంగాణ’ సదస్సులో మాట్లాడుతూ, తెలంగాణ సమగ్ర అభివృద్ధికోసం నిర్మిస్తున్న నీటిపారుదల, విద్యుత్ తదితర ప్రాజెక్టుల కోసం అప్పు చేస్తున్నామని, ఇది తప్పు కాదన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్మిస్తున్న వేర్వేరు ప్రాజెక్టుల వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి ఏకైక లక్ష్యంగా, పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలో అగ్రభాగాన నిలిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాటుపడుతున్నారని వినోద్‌కుమార్ పేర్కొన్నారు.
*చిత్రం... న్యూజెర్సీలో సోమవారం జరిగిన సదస్సులో ఎన్నారైలతో వినోద్‌కుమార్