తెలంగాణ

డెడ్‌లైన్ ముగిసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరడానికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది. అయితే, ప్రభుత్వం ఆశించిన స్థాయిలో విధుల్లో చేరడానికి కార్మికులు ముందుకు రాలేదని సమాచారం. మంగళవారం రాత్రి 10 గంటల వరకు కేవలం 520 మంది కార్మికులు మాత్రమే సమ్మతి పత్రాలు ఇచ్చినట్టు అధికార వర్గాల సమాచారం. దీంతో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి. విధుల్లో చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తూ రాత్రి 12 గంటలకు వరకు అందిన దరఖాస్తులను జిల్లాల నుంచి డిపోల వారీగా సేకరించి ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనుంది. విధుల్లో చేరడానికి ముందుకొచ్చిన కార్మికుల సంఖ్య ఆధారంగా ఎన్ని రూట్లను ప్రైవేటీకరించాలనే కీలక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు వచ్చే దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం నిర్ణయించింది. విధుల్లో చేరే వారిని మినహాయించి మిగిలిన రూట్లను ప్రైవేట్‌పరం చేయనున్నట్టు ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఇలాఉండగా విధుల్లో చేరడానికి వచ్చే కార్మికులను ఆందోళనకారులు అడ్డుకునే అవకాశం ఉండటంతో విధుల్లో చేరే వారికి వెసులుబాటు కల్పిస్తూ జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలు, ఆర్టీయే అధికారులు, డీఎస్పీలు, ఆర్టీసీ డివిజన్ మేనేజర్లు, రీజనల్ మేనేజర్లకు కూడా సమ్మతి పత్రాలు ఇవ్వడానికి అవకాశం కల్పించింది. వివిధ చోట్లకు చేరిన దరఖాస్తుల వివరాలు బుధవారం ఉదయానికల్లా రవాణా శాఖ, ఆర్టీసీ సేకరించి మధాహ్నం ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే ఎన్ని రూట్లను ప్రైవేట్‌పరం చేయాలనే అంశం ఖరారు కానుంది.