తెలంగాణ

వీహెచ్, షబ్బీర్ మధ్య మాటల తూటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాంగ్రెస్ నేతల వాగ్వాదంతో గాంధీభవన్ వేడెక్కింది. ఏఐసీసీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళనలు చేపట్టాలని ప్రచారం చేసేందుకు మంగళవారం ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆజాద్ గాంధీభవన్‌లో పార్టీ సీనియర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నేతలు వీ హనుమంతరావు,
షబ్బీర్ అలీ మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. వీహెచ్ మాట్లాడుతూ ఆరెస్సెస్ భావజాలం ఉన్న వారికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ఆజాద్ దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ సీనియర్లకు తెలియకుండా ఏకపక్షంగా వివిధ నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారని, పార్టీని ఏకతాటిపైకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీలో సమన్వయం లేదని ఆయన అన్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ వ్యతిరేక తీవ్రంగా నెలకొని ఉందని, కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాలని కోరారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ, వీహెచ్ మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరుకోవడంతో సీనియర్ నేత ఆజాద్ జోక్యం చేసుకున్నారు. పార్టీ నేతలు సమన్వయంతో వ్యవహరించాలని సర్ది చెప్పారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తనకు పీసీసీ అధ్యక్ష పదవిని అప్పగించాలని కోరారు. తాను పార్టీలో అన్ని వర్గాలను కలుపుకునిపోతానని, పార్టీని పటిష్టం చేస్తానని ఆజాద్‌ను కోరారు. కాగా, పార్టీ సమావేశంలో సీనియర్లు పరస్పరం నిందించుకోవడం పట్ల గాంధీభవన్‌కు వచ్చిన పలువురు యువనేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అన్ని రకాలుగా ఆటుపోట్లను ఎదుర్కొంటున్న సమయంలో, సీనియర్లే బహిరంగంగా విమర్శించుకోవడం వల్ల ప్రయోజనం లేదని, దీనివల్ల పార్టీ పరువువీధిలో పడుతుందన్నారు.