తెలంగాణ

సమ్మెను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాల రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, నవంబర్ 5: ప్రజాబలం లేని ప్రతిపక్షాలు ఆర్టీసీ సమ్మెను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాయని, కార్మికులు దీన్ని గుర్తించి భేషరతుగా విధుల్లో చేరాలని రాష్ట్ర గిరిజన, స్ర్తిశిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంగళవారం ఆర్టీసీ సమ్మె, కార్మికుల భవిష్యత్తుపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. గతంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఆర్టీసీని లాభాల బాటలో నడిపించారని సత్యవతి అన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆర్టీసీకి 43 శాతం ఫిట్‌మెంట్, ఐఆర్ ఇచ్చి కార్మికుల వేతనాలను భారీగా పెంచారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నా యూనియన్‌లు స్వార్ధ ప్రయోజనాల కోసం కార్మికులను సమ్మేకు ఉసిగొలుపుతూ నష్టాల్లోకి తీసుకెళ్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల, ఉద్యోగుల పక్షపాతి అని అన్ని వర్గాల వేతనాలను భారీగా పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తప్పా మిగిలిన డిమాండ్లపై చర్చించాలని హైకోర్టు సూచించినా ఆర్టీసీ యూనియన్‌లు మొండిగా ప్రవర్తిస్తున్నాయన్నారు. ప్రతిపక్షాలు, యూనియన్‌లు తమ స్వార్ధం కోసం ఆర్టీసీ కార్మికుల, ఉద్యోగుల కుటుంబాలను ఇబ్బందుల పాలు చేస్తున్నాయన్నారు. పార్లమెంట్‌లో ఆర్టీసీ ప్రైవేటీకరణ బిల్లుకు ఓటువేసిన బీజేపీ ఎంపీలు ఇక్కడ ఉద్యమాలు చేయడం విచిత్రంగా ఉందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా? అని ఆమె ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు విధుల్లో చేరుతామని వస్తుంటే యూనియన్ నాయకులు అడ్డుకుంటున్నారని, దాడులు చేస్తున్నారని ఇలాంటి పరిస్థితి మంచిది కాదని హితవుపలికారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మనసుతో ఇచ్చిన పిలుపును అందుకొని వెంటనే విధుల్లో చేరాలని కోరారు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రయోజనాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటారని సత్యవతి అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో మానుకోట ఎంపీ మాలోతు కవిత, జడ్పీ చైర్‌పర్సన్ ఆంగోతు బిందు, తెరాస నాయకులు పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, బండి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సత్యవతి రాథోడ్