తెలంగాణ

విజయారెడ్డి డ్రైవర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్, నవంబర్ 5: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తహశీల్దార్ సజీవదహనం ఘటన సమయంలో ఆమెను కాపాడే ప్రయత్నంలో గాయపడిన డ్రైవర్ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. సోమవారం అబ్దుల్లాపూర్‌మెట్ మండల కార్యాలయంలోనే తహశీల్దార్ విజయారెడ్డిని గౌరెల్లికి చెందిన నిందితుడు సురేష్ పెట్రోల్ పోసి నిప్పంటించి హతమార్చిన సంగతి విదితమే. ఆ ఘటన సమయంలో తహశీల్దార్‌ను రక్షించే ప్రయత్నంలో ఆమె డ్రైవరు గురునాధంకు సైతం మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. 60 శాతం కాలినగాయాలతో కంచన్‌బాగ్ డీఆర్‌డీఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. మంగళవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సూర్యాపేట జిల్లా వెల్దండ గ్రామానికి చెందిన గురునాధం కొంతకాలం క్రితం నగరానికి వచ్చి లారీడ్రైవర్‌గా పనిచేసాడు. ఆతరువాత ఐదు సంవత్సరాల క్రితం నుండి ఔట్‌సోర్సింగ్ విభాగంలో తహశీల్దార్ కారుడ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గురునాధంకు భార్య సౌందర్య, మూడేళ్ల కుమారుడు సిద్దార్ధ ఉన్నారు.ప్రస్తుతం సౌందర్య గర్భవతి కావటంతో నేరేడుచెర్ల మండలం వైకుంఠాపురం గ్రామంలో పుట్టింటి వద్దఉంటుంది. సోమవారం ఘటన గూర్చి తెలియటంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. మంగళవారం గురునాధం మృతి సమాచారం వెల్లడించడంతో అతని తల్లి, భార్య రోదనలతో అక్కడ విషాద వాతావరణం చోటుచేసుకుంది. గురునాథం కుటుంబ సభ్యులు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. దీంతో ఇక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గురునాథ్ కుంటుంబాన్ని అదుకోని, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని పలువురు డిమాండ్ చేశారు. గురునాథ్‌తో పాటు మరోకరు చెంద్రయ్య ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కుటుంబ సభ్యులతో గురునాథం (ఫైల్‌ఫొటో)