తెలంగాణ

రైతు హామీలు గాలికి వదిలేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: రాష్ట్రప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రైతు వాగ్దానాలను గాలికి వదిలేసిందని ఆరోపిస్తూ బీజేపీ కిసాన్‌మోర్చ నేతల బృందం మంగళవారం నాడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా వారు రెండు పేజీల వినపతిపత్రాన్ని సమర్పించారు. రైతుల లక్ష రూపాయిల రుణాన్ని మాఫీ చేయాలని, అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న వరి, పత్తి, మొక్కజొన్న మొదలైన పంటలకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిచాలని, ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన పంటలు చివరి గింజ వరకూ కొనుగోలు చేయాలని , పంటల నష్టాన్ని అధ్యయనం చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన అమలుచేయాలని, రైతులు అందరికీ సాయిల్ హెల్త్ కార్డులను ఇవ్వాలని, ప్రస్తుత రబీ సీజన్‌లో ఎరువుల కొరత లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు., కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూధనరావు, ప్రధాన కార్యదర్శి బీ పాపయ్య గౌడ్, వీ సుదర్శన్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కే రంగారెడ్డి, కళ్లెం బాల్‌రెడ్డి, రాష్టక్రార్యవర్గ సభ్యుడు యాదగిరి రెడ్డి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతాంగానికి ఎలాంటి షరతులు లేకుండా లక్షరూపాయిల వరకూ ఒకే దఫా రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిందని, హామీని నట్టేట ముంచిందని వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా శాసనసభలో రైతులే తమ రుణాలను రెన్యూవల్ చేసుకోవాలని చెప్పడం దారుణమని అన్నారు. రుణమాఫీ జరుగుతుందని రైతులు గంపెడాశతో ఎదురుచూస్తున్నారని, వ్యవసాయ పెట్టుబడులకు ప్రైవేటు వడ్డీవ్యాపారులపై ఆధారపడి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరింత రుణభారంతో కుంగిపోతున్నారని అన్నారు. రైతులు ఆరుగాలం కష్టంచి పండించిన పంటలు చేతికందే సమయానికి అకాల వర్షాల వల్ల పూర్తిగా దెబ్బతిని నష్టపోతున్నారని వారు పేర్కొన్నారు. అతివృష్టి, అనావృష్టి, అకాల వర్లాకు పంటలు దెబ్బతిని నష్టపోయినా రైతులు మాత్రం ప్రధానమంత్రి ఫసల్‌బీమా అమలుకు నోచుకోలేదని, ప్రధానమంత్రి పథకం రైతాంగానికి వరం లాంటిదని అన్నారు.