తెలంగాణ

ఆర్టీసీ డిపోల వద్ద భారీ పోలీసు బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఈనెల 5వ తేదీలోపు విధుల్లో చేరాలని, సమ్మెకు దిగిన ఆర్టీసీ సిబ్బందికి ముఖ్యమంత్రి కేసీఆర్ డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరే అవకాశం ఉందని భావించిన పోలీసు ఉన్నాతాధికారులు రాష్ట్రంలోని వివిధ జిల్లాలో ఉన్న ప్రధాన బస్‌డిపోల వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో కొందరు కార్మికులు విధుల్లో చేరారు. వీరికి రక్షణ కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర పోలీసులు ముందుగానే ప్రకటించారు. అయినప్పటికీ హైదరాబాద్, రాజకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని అర్టీసీ కార్మికులు విధులకు హాజరైతే వారికి ఎలాంటి విఘాతం కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా పోలీసు అధికారులు ఆయా బస్ డిపోలు, బస్టాండ్‌లలో రెట్టింపు బందోబస్తును ఏర్పాటుచేసి పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకున్నారు. కార్మికులు విధుల్లో చేరొచ్చని, ఇబ్బందులకు గురిచేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనర్లు మహేశ్ భగవత్, సజ్జనార్, అంజనీ కుమార్‌లు ముందుగానే హెచ్చరించారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగర పోలీసులు శాంతి భద్రతలపై దృష్టి సారించడంతో పాటు మహాత్మాగాంధీ బస్ డిపో (సీబీఎస్), సికింద్రాబాద్‌లోని జేబీఎస్ బస్టాండ్, డిపో వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికులు తక్షణమే విధుల్లో చేరాలని ప్రభుత్వం పిలుపునిచ్చినప్పటికీ కార్మికుల్లో సరైన స్పందన రాకపోవడంతో అతి తక్కువ సంఖ్యలో కార్మికులు విధులకు హాజరైనట్లు తెలిసింది.