తెలంగాణ

ఆర్టీసీ కార్మికులతోనే తిరుగుబాటు మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, నవంబర్ 6: రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో ఏ వర్గంవారు కూడా సంతోషంగా లేరని, ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు ఆర్టీసీ కార్మికులతో మొదలైందని పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లురవి అన్నారు. నిరవధిక సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు స్థానిక గాంధీపార్కులో ఏర్పాటు చేసుకున్న నిరసన శిబిరాన్ని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ, జడ్పీటీసీ కేవీఎన్‌రెడ్డిలతో పాటు ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి మల్లురవి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మె ప్రారంభంలో సెల్ఫ్ డిస్మిస్ అంటూ సీఎం ప్రకటనలు చేసిన తరువాత మళ్లీ ఉద్యోగాలలో చేరాలంటూ డెడ్‌లైన్ అంటూ మరోమారు ప్రకటనలు చేయడం చూస్తుంటే ఆయన ప్రకటనలు ఎంత విచిత్రంగా ఉన్నాయో అర్థమవుతున్నాయన్నారు. ఆర్టీసీని కాపాడుకోవడంతోపాటు ఉద్యోగ భద్రత కోసం 50 వేలమంది కార్మికులు ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగం అందించిన హక్కుతో సమ్మె చేస్తుంటే దానిని నివారించేందుకు చర్యలు తీసుకోవాల్సిన సీఎం కార్మికులను బెదిరింపులు, హూంకరింపులతో మాట్లాడటం ఒక నియంతను గుర్తుకు తెచ్చేలా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన డెడ్‌లైన్‌కు ఆర్టీసీ కార్మికులు పైసావంతు కూడా విలువ ఇవ్వలేదని, న్యాయం, ధర్మం, చట్టం వారికి అండగా ఉన్నందుకే ఎన్ని బెదిరింపులు చేసినా కార్మికులు ప్రజాస్వామ్య పద్ధతిలో మహాత్మాగాంధీ చూపిన మార్గంలో సమ్మెను కొనసాగిస్తున్నారని, వారికి రాష్ట్రంలోని అధికార పార్టీ తప్ప మిగతా అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం తెలుపుతూ వారి వెంట పయనిస్తున్నాయన్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలకోసం ఉన్న ఆర్టీసీని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను విచ్ఛినం చేసేందుకు ప్రభుత్వం అనేక కుట్రలు చేసినా కార్మికులు వాటిని ఎదుర్కొంటూ విజయవంతంగా సమ్మెను కొనసాగిస్తున్నారని, ఆర్టీసీని రక్షించుకునేందుకే కార్మికులు ఈ త్యాగం చేస్తున్నారనే విషయం ప్రపంచానికి తెలిసిందన్నారు. పోలీస్‌స్టేషన్లలో ఉండాల్సిన పోలీసులు నేడు ఆర్టీసీ కార్మికుల చుట్ట్టూ తిరుగుతున్నారని, బస్టాండ్లు, డిపోలనే పోలీస్‌స్టేషన్లుగా మార్చుకొని శాంతిభద్రతలను గాలికి వదిలేశారని ఆరోపించారు. కార్మిక పక్షపాతిగా గుర్తింపుపొందిన మంత్రి నిరంజన్‌రెడ్డి, ఉద్యోగుల నేతగా ఉన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌లు స్పందించి ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేకూర్చేందుకు వీలుగా సీఎంకు నచ్చచెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో మొండిగా వెళ్తున్న సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు, 25 మంది సలహాదారులు సరైన సలహాలు ఇచ్చి సమ్మెకు పరిష్కారం చర్చలతోనే సాధ్యమనే విషయాన్ని తెలియచేయాలని ఆయన సూచించారు. ఇప్పటికైనా కేసీఆర్ తన వైఖరిని మార్చుకోకపోతే రాబోయే రోజులలో సొంతపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు తిరగబడే ప్రమాదం ఉందన్నారు. ఈనెల 9న ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న చలో టాంక్‌బండ్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వడంతోపాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేస్తామని మల్లు రవి చెప్పారు.