తెలంగాణ

సాగర్ ఎడమ కాల్వకు నీరు నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, నవంబర్ 6: నాగార్జునసాగర్ జలాశయం నుండి ఎడమ కాల్వకు విడుదల చేస్తున్న నీటిని బుధవారం తెల్లవారుజామున డ్యాం అధికారులు నిలిపివేశారు. ఎడమ కాల్వ పరిధిలో వారబందీ పద్ధతిలో నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయంలో నీటిమట్టం 589.80 అడుగులుగా ఉంది. శ్రీశైలం నుండి నాగార్జునసాగర్ 44,588 క్యూసెక్కులు వస్తుండగా కుడి కాల్వ ద్వారా 9,633 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 33,845 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,800 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు మొత్తంగా 44,588 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి ఎగువ నుండి 67,254 క్యూసెక్కులు వస్తుండగా ప్రస్తుతం 882.90 అడుగులుగా ఉంది.