తెలంగాణ

వెలిదండలో డ్రైవర్ గురునాథం అంత్యక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరిడేపల్లి, నవంబర్ 6: అబ్దుల్లాపుర్ రెవెన్యూ కార్యాలయంలో జరిగిన ఘటనలో గాయపడి మృతి చెందిన డ్రైవర్ కామళ్ల గురునాథం అంత్యక్రియలు బుధవారం అశ్రునయనాల మధ్య స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా వెలిదండ గ్రామంలో ప్రశాంతంగా జరిగాయి.
అబ్దుల్లాపుర్‌మెట్ రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ విజయారెడ్డిని సజీవదహనం అవుతుండగా, దానిని ఆపడానికి ప్రయత్నించిన ఆమె డ్రైవర్ గురునాథం కూడా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, గురునాథం మృతదేహం మంగళవారం రాత్రి ఏడున్నరకు గ్రామానికి చేరుకుంది. గురునాథం మృతి పట్ల గ్రామస్తులంతా సానుభూతి వ్యక్తం చేశారు. అంత్యక్రియల్లో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒకరి ప్రాణాలు కాపాడబోయి తాను ప్రాణాలర్పించడంతో గ్రామస్తులంతా విచారం వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచి కష్టపడి పనిచేసేవాడని, పేదరికంలో పుట్టినప్పటికి కుటుంబ బాధ్యత కూడా చూసేవాడని తెలిపారు. మూడు సంవత్సరాల క్రితం వివాహం అయిన గురునాథంకు భార్య సౌందర్య, సిద్దార్ధ(3) ఉన్నారు. అయితే ప్రస్తుతం భార్య సౌందర్య 8 నెలల గర్భిణీ కావటంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. వెలిదండ గ్రామమంతా రోదనలతో నిండిపోయింది. అంత్యక్రియలకు గరిడేపల్లి ఎస్‌ఐ వెంకన్న, బేగ్, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
*చిత్రం... గురునాథం అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రజలు