తెలంగాణ

పెట్రోల్ పోసి తగలబెడతా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్వ, నవంబర్ 6: భగీరథ పైపులైన్‌ను వెంటనే తొలగించకపోతే నిన్ను పెట్రోల్ పోసి తగలబెడతా అంటూ పంచాయతీ కార్యదర్శిని ఒక వ్యక్తి బెదిరించిన సంఘటన వనపర్తి జిల్లాలో జరిగింది. నర్వ మండల పరిధిలోని కల్వాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కర్ణం లోకేష్‌ను అదే గ్రామానికి చెందిన బోయ వెంకటయ్య బుధవారం బెదిరింపులకు గురి చేశాడు. గ్రామంలోని తన పెంటకుప్పలో మిషన్ భగీరథ పైపులైన్ ఎలా వేశారని, వాటిని తొలగిస్తావా లేదా నీఅంతు చూస్తా అని కార్యాలయం తలుపులు మూసి భయంభ్రాంతులకు గురి చేశాడని కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు. తహశీల్దార్‌ను పెట్రోల్ పోసి అంటించినట్టు నిన్ను కూడా అలా చేస్తానని బోయ వెంకటయ్య కార్యాలయం ముందు హల్‌చల్ చేయగా పక్కనే ఉన్న గ్రామస్తులు సముదాయించారు. కార్యదర్శికి సంబంధం లేని విషయంపై వెంకటయ్య రాద్ధాంతం చేయడం, తలుపులు మూసి నిర్బంధించి విధులకు ఆటంకం కలిగించాడు. దీనిపై కార్యదర్శులు నర్వ పోలీస్‌స్టేషనలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వెంకటయ్యపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐ జయశంకర్‌కు ఫిర్యాదు అందజేశారు. ఈ విషయంపై వెంకటయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్ట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా, పంచాయతీ కార్యదర్శులందరూ మూకుమ్మడిగా ఎంపీడీఓ రమేష్‌కుమార్ వినతిపత్రాలు అందజేసి, గ్రామాల్లో విధులు నిర్వహించాలంటే కొందరు తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
*చిత్రం... పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు