తెలంగాణ

ఆర్టీసీ ప్రైవేటుపరం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ ఇక ప్రైవేటుపరం కానుందా? ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో హెచ్చరించిన విధంగానే నూరు శాతం ప్రైవేటీకరణవైపే సర్కారు అడుగులు వేస్తున్నదా? ఇందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాల్సిందిగా అధికారులను ఇప్పటికే ఆదేశించిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. పరిస్థితులను చూస్తుంటే, ఇది నిజమేనన్న అభిప్రా యం ఏర్పడుతున్నది. బేషరత్‌గా విధుల్లో చేరడానికి ఇచ్చిన వెసులుబాటును ఆర్టీసీ కార్మికులు వినియోగించుకోకపోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ముందుగా హెచ్చరించిన విధంగా ఆర్టీసీ మొత్తాన్ని ప్రైవేట్‌పరం చేయడానికే ప్రభు త్వం మొగ్గు చూపినట్టు సమాచారం. అందులో భాగంగానే, ఆర్టీసీ రూట్లలో ప్రైవేట్ వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని సూత్రప్రాయంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చి న గడువు ముగియడం, హైకోర్టులో గురువారం ఆర్టీసీ సమ్మె పై ప్రభుత్వ వాదనలు, సమ్మె నేపథ్యం లో ప్రజారవాణా వ్యవస్థకు ప్రత్యామ్నాయం చర్యలపై ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తొమ్మిది గంటల పాటు సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై గురువా రం వాదనలు ఉండడంతో అధికారికంగా వెల్లడించకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచా రం. ఇలావుండగా ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరడానికి మంగళవారం అర్ధరాత్రి వరకు కల్పించిన వెసులుబాటుకు స్పందించిన కార్మికులు, ఉద్యోగుల వివరాలను ఆర్టీసీ అధికారులు సీఎంకు నివేదించారు. ప్రభుత్వ హెచ్చరికలను ఆర్టీసీ కార్మికులు బేఖాతర్ చేసిన అంశంపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఆర్టీసీలో 5,100 బస్సులకు ప్రైవేట్‌కు అప్పగించాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తూనే, ప్రస్తుతం ఆర్టీసీలో పని చేస్తున్న కార్మికులు, సమ్మతి పత్రాలు ఇచ్చిన వారిని మినహాయించి మిగితా రూట్లను కూడా ప్రైవేట్‌కే అప్పగించాలని కీలక నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీ య వర్గాల ద్వారా తెలిసిం ది. ఆర్టీసీ రూట్లను ప్రైవేట్‌పరం చేయడానికి విధివిధానాలను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. సమ్మెపై హైకోర్టులో జరిగే విచారణలో ప్రభుత్వ వాదనలను సమర్థంగా వినిపించేందుకు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు అడ్వకే ట్ జనరల్ రామచంద్రరావుకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ, కమిషనర్ సందీప్ సుల్తానియా, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.