తెలంగాణ

ముంపు బాధితులకు పునరావాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 6 : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అనంతగిరి జలాశయంలో ముంపునకు గురవుతున్న చిన్నకోడూరు మండలం కొచ్చగుట్టపల్లి గ్రామ భూ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట మున్సిపాల్టీ లింగారెడ్డిపల్లిలో సకల వసతులతో పునరావాసం కల్పించింది. బుధవారం కొచ్చగుట్టపల్లి గ్రామ భూ నిర్వాసితులకు లింగారెడ్డిపల్లిలో నిర్మించిన 130 డబుల్ బెడ్‌రూం ఇళ్లకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ రోజాశర్మ, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డితో కలసి సామూహిక గృహాప్రవేశాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్‌రావుమాట్లాడుతూ దేశంలో కొత్త ఆర్‌అండ్‌ఆర్ చట్టం ప్రకారం నిర్మించిన గ్రామంగా రంగనాయకపురం చరిత్ర సృష్టించిందన్నారు. రాష్ట్రంలో నిర్మించిన తొలి ఆర్ అండ్ కాలనీ ఇదేనని ఆయన అన్నారు. 2013 పునరావాస కేంద్ర చట్టం ప్రకారం పేదలకు ఐఏవై కింద 75 గజాల స్థలంలో1.25 లక్షలతో ఇళ్లు కట్టించి ఇవ్వా ల్సి ఉండేదని, కానీ త్యాగం చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వమే 250 గజాల స్థలం ఇచ్చి డబుల్ బెడ్ రూం కట్టివ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించి అమ లు చేశారని వెల్లడించారు. మీత్యాగం వెలకట్టలేనిదని..అందరికంటే ముందు సంతకం పెట్టి సంతకం పెట్టి సహకరించారని, మీరు చేసిన త్యాగానికి సిద్దిపేట సమీపంలో స్థలాన్ని
వెతికి ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. కొచ్చగుట్టపల్లి..ఇక కొత్తగుట్టపల్లి ఈకాలనీ ఇకనుండి రంగనాయకపురంగా పిలుస్తూ ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. రంగనాయకస్వామి దేవాలయం, రంగానాయకస్వామి రిజర్వాయర్ సమీపంలో ఉన్నందున రాష్ట్రంలో మొట్టమొదట ప్రారంభించుకున్న ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి రంగనాయక పురంగా నామకరణం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. అనంతగిరి రిజర్వాయర్‌లో చేపలు పట్టేందుకు భూ నిర్వాసితులందరికీ శాశ్వత హక్కులు కల్పించి, ప్రతియేటా నికర ఆదాయం వనరులు లభిస్తాయన్నారు. చెరువుల్లో చేపలు పట్టేందుకు కొచ్చగుట్ట గ్రామస్థులందరికీ సర్వ హక్కులు కల్పిస్తామన్నారు. అంతగిరి రిజర్వాయర్ ప్రాజెక్టు కింద లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఉమ్మడి మెదక్ జిల్లా, వరంగల్, నల్లగొండ, యాదాద్రి, మేడ్చల్ జిల్లాలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. రంగనాయక, అంతగిరి రిజర్వాయర్లలో ఎప్పుడూ నీళ్లు నిండి ఉండేలా చేపలు, రొయ్యలతో ప్రతియేటా నికర ఆదాయం వస్తుందన్నారు. కాగా, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చేయని ప్రయత్నాలు లేవన్నారు. సీఎం కేసీఆర్‌కు దైవభక్తి ఎక్కువని..దైవానుగ్రహంతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందన్నారు. దేవుడి కృపతో వరంగల్ జిల్లాకు తొలి ఫలితం వచ్చిందన్నారు. త్వరలోనే అనంతగిరి, రంగనాయక్‌సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు వస్తాయని, రెండు పంటలు పండే కాలం త్వరలో వస్తుందన్నారు. నల్లగొండ జిల్లా చిట్టచివరి చెరువును నింపుతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బాహుబలి పంపుగా పేరుపెట్టిన 7 పంపులు విజయవంతమయ్యాయన్నారు. రాబోయే రోజుల్లో సిద్దిపేటు ఇండస్ట్రియల్ పార్కు వస్తుందని, రంగనాయక్‌పురంలో చదువుకున్నవారికి ఉద్యోగ, ఉపాధి కల్పనలో మొదటి ప్రాధాన్యత కల్పిస్తానన్నారు. భూ నిర్వాసితులను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తమపై ఉందన్నారు. ఊరుకు ఊరును రూపొందించి..అన్ని వసుతులు కల్పించినట్లు తెలిపారు. ప్రతి ఇంటికి డ్రైనేజీతో పాటు రాజీ లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. కాలనీలో సీసీ కెమెరాలు, ఫంక్షన్ హాల్, పాఠశాల, అంగన్‌వాడీ, హనుమాన్ దేవాలయం, మిల్క్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. కాలనీలో మిగిలిన సమస్యలన్నీ త్వరలో పరిష్కరిస్తామని మంత్రి హరీష్‌రావు భరోసానిచ్చారు.
గ్రామస్థులతో సహపంక్తి భోజనం
సిద్దిపేట లింగారెడ్డిపల్లి గ్రామంలో కొచ్చగుట్టపల్లి నిర్వాసితులకు పునరావాసం కింద నిర్మించిన రంగనాయకపురం గ్రామస్థులతో కలసి మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ రోజాశర్మ, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, జేసీ పద్మాకర్ సహపంక్తి భోజనం చేశారు.

*చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి