తెలంగాణ

మరో ఆర్టీసీ కార్మికుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 6: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చేపట్టిన సమ్మె తీవ్రరూపం దాల్చగా మరో కార్మికుని గుండె ఆగింది. బుధవారం కరీంనగర్ 2-డిపోకు చెందిన మెకానిక్ మహమ్మద్ కరీంఖాన్ గుండెపోటుతో మృతి చెందాడు. తెలంగాణ చౌక్‌లో జాఫ్రీ మజీద్‌లో జనాజా నమాజ్ చేసి (దువ్వా) చేశారు. మసీద్ నుంచి కరీంఖాన్ పార్థివదేహాన్ని కబ్రస్తాన్‌కు తరలించే క్రమంలో బీసీపీ, సీపీఐ, కాంగ్రెస్ నేతలు అడ్డుకొని ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, నగరంలోని శివాలయం సమీపంలో గల కబ్రస్తాన్‌లో కరీంఖాన్ పార్థివదేహం ముస్లిం సంప్రదాయ ప్రకారం (తత్‌ఫీన్) ఖననం చేశారు. అంతకుముందు ఆందోళనకారులు మాట్లాడుతూ చర్చలు జరుపకుండా ‘డెడ్’లైన్లు పెడ్డడంతోనే మానసిక ఆందోళనకు గురై కరీం గుండెపోటుకు గురయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బుధవారం హైదరాబాద్‌లో సకల జనుల సభకు హాజరై ప్రతిపక్షాల, కార్మిక నేతల ప్రసంగాలు వింటూ ఇదే టూ డిపో డ్రైవర్ ఎన్.బాబు గుండెపోటుకు గురైన సంఘటన నుంచి ఇక తేరుకోకముందే మెకానిక్ కరీం గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆర్టీసీసమ్మెకు స్వస్తిపలికి విధుల్లో చేరాలనే సీఎం ‘డెడ్’లైన్‌ను పెట్టడంతో కలత చెంది గుండెపోటుతో ఆర్టీసీ కార్మికులు తనువు చాలిస్తున్నారని సీపీఐ, బిఎస్‌పి, కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికసమ్మె 3 2రోజులుగా కొనసాగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో తీవ్రరూపం దాల్చుతోంది. సమ్మెకు దిగిన 50 వేలమంది భవితవ్యంతో ప్రభుత్వం అసహనం వెళ్ళగక్కుతూ ఇదో దిక్కుమాలిన సమ్మెగా సీఎం కేసీఆర్ ప్రస్తావించడం అగ్నికి ఆజ్యం పోసినట్టేనని నాయకులు మండిపడుతున్నారు. ప్రభుత్వంలో విలీనం చేస్తారో..లేదో, సమ్మెపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యోగాలుంటాయో? ఊడుతాయో? అని కలతచెంది కరీంనగర్ గుండెపోటుకు గురి కావడానికి సీఎం కారణమని బీఎస్‌పీ, సీపీఐ, కాంగ్రెస్ నాయకులు మండి పడ్డారు. కాగా భారీ పోలీస్ బందోబస్తు మధ్య కరీంఖాన్ మృతదేహాన్ని (తత్‌ఫీన్) ఖననం చేశారు.