తెలంగాణ

ఇండియన్ రెడ్ క్రాస్‌లో చేరండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 6: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్) లో చేరాలని విద్యార్థులు, యువతకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపు ఇచ్చారు. ఐఆర్‌సీఎస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా గవర్నర్ పనిచేస్తున్నారు. 2019 నవంబర్ 1 న యువతను ఐఆర్‌సీఎస్‌లో చేర్చడం ప్రారంభం కాగా, ఈ కార్యక్రమం డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది. నవంబర్ 1 నుండి 4 వరకు నాలుగు రోజుల్లోనే 70 వేల మంది యువత, విద్యార్థులు ఇందులో చేరారు. ఈ సందర్భంగా ఐఆర్‌సీఎస్ జిల్లా యూనిట్ల చైర్‌పర్సన్లతో చర్చించేందుకు రాజ్‌భవన్‌లో బుధవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ, కొత్తగా ఐఆర్‌సీఎస్‌లో చేరుతున్న విద్యార్థులు, యువతకు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలైన ఆరోగ్యం, స్వచ్ఛ్భారత్, హరితహారం, ఫస్ట్‌ఎయిడ్, రక్తదానం తదితర అంశాలపై అవగాహన, శిక్షణ ఇవ్వాలని కోరారు. వరంగల్, మేడ్చల్ రెడ్ క్రాస్ యూనిట్లు చేస్తున్న సేవలను తమిళిసై ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ సెక్రటరీ కె. సురేంద్ర మోహన్, గవర్నర్ డిప్యూటీ సెక్రటరీ రఘుప్రసాద్, ఐఆర్‌సీఎస్ రాష్ట్ర చైర్మన్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.