తెలంగాణ

భూరికార్డుల ప్రక్షాళనతోనే విపరీత పరిస్థితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 6: రాష్ట్రంలో భూ వివాదాలపై హైకోర్టు సిటింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళన విపరీత పరిస్థితులకు దారితీస్తోందన్నారు. భూ వ్యవహారాలకు సంబంధించి గతంలో అనేక ఉద్యమాలు వచ్చాయన్నారు. అందులోనిది ఒక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమన్నారు. ఈ సాయుధ రైతాంగ భూ పోరాటమే చివరకు స్వతంత్ర పోరాటంగా మారిందన్నారు. ఒక అధికారిని తన కార్యాలయంలో కాల్చి చంపిన ఘటన దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. రైతులకు సంబంధించి భూమి వివాద సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ అధికారి విజయారెడ్డి హత్య దిగ్భ్రాంతి కలిగించిందని, ఈ దుర్ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. గత రెండు సంవత్సరాలకు పైగా భూములకు సంబంధించి 9 లక్షల పాస్ బుక్‌లను పార్ట్‌బీలో పెట్టారన్నారు. అప్పటి నుంచి ఆ భూముల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. 9 లక్షల పాస్‌బుక్‌లకు సంబంధించి భూముల్లో ఎక్కువగా మధ్య, పేద వర్గాలకు చెందిన వారి భూములు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఆయా భూముల్లో అసైన్డ్ భూములు, ఇనామ్ భూములు, ఎండోమెంట్ భూములు, సాదాబైనామాలు కూడా ఉన్నాయన్నారు. వాటి వివాదాలకు సంబంధించిన వ్యవహారాలను పరిష్కారం చేయకుండా పెండింగ్‌లో పెట్టడం వల్లనే ఇలాంటి ఘటనలకు దారితీస్తున్నాయన్నారు.