తెలంగాణ

అసెంబ్లీ కమిటీలు కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 6: ప్రజాస్వామ్యంలో చట్టసభలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందో అదే విధంగా శాసనసభ ఏర్పాటు చేసిన కమిటీలకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ సంస్థల పనితీరును సమగ్రంగా పర్యవేక్షించడం ప్రభుత్వ రంగ సంస్థల బాధ్యతని గుర్తుచేశారు. ప్రభుత్వ రంగ సంస్థ సమితి చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశానికి స్పీకర్ మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుకు సంబంధించిన నివేదికలు, లెక్కలపై కాగ్ ఇచ్చే నివేదికలను కూడా కమిటీ పరిశీలించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ సంస్థల స్వయం పాలనాధికారం, సామార్ధ్యం తదితర అంశాలను కూడా కమిటీ పరిశీలించాల్సి ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ అధ్యక్షతన శాసనమండలి హామీల కమిటీ తొలి సమావేశానికి కూడా స్పీకర్, శాసనమండలి చైర్మన్ హాజరై కమిటీ విధి విధానాలపై కమిటీ సభ్యులకు అవగాహన కల్పిపించారు.