తెలంగాణ

బీజేపీలో మున్సి‘పోల్’ జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 6: భారతీయ జనతా పార్టీ రానున్న మున్సిపల్ ఎన్నికల సన్నద్ధత వ్యూహంతో బుధవారం నాడు కీలక భేటీ నిర్వహించింది. ఈ భేటీకి బీజేపీ జాతీయ సంస్థాగత ఎన్నికల ఎన్నికల అధికారి, మాజీ కేంద్ర మంత్రి రాధా మోహన్‌సింగ్ హాజరయ్యారు. ఎంపీలు, వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, మోర్చాల అధ్యక్షులు, జిల్లా సభ్యత్వ ప్రముఖులు, సహ ప్రముఖులు, ఎన్నికల అధికారులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పనిలో పనిగా సంస్థాగత ఎన్నికల అంశంపైనా సుదీర్ఘంగా చర్చించారు. నవంబర్ చివరి నాటికి అన్ని మండలాల్లో, జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేయడం, డిసెంబర్ నాటికి రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీల ప్రతినిధులను నియమించు కోవడం కోసం ఈ కసరత్తు జరిగినట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు.
లక్ష్మణ్ వారసుడి ఎంపిక
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మణ్ పదవీకాలం ముగియనుండటంతో ఆయన వారసుడి వేటలో పార్టీ పడింది. ఈసారి అవకాశం నల్లు ఇంద్రసేనారెడ్డి లేదా మాజీ కేంద్ర మంత్రి , మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావులకు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చేందుకు తనకు ఏ బాధ్యతను అప్పగించినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని ఇప్పటికే విద్యాసాగరరావు వ్యాఖ్యానించారు. అలాగే ఇంద్రసేనారెడ్డి సైతం పార్టీ కార్యక్రమాలపైనే ఎక్కువ దృష్టిసారించారు. ఇప్పటికే ఈ ఇరువురు నేతలూ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. వరుసగా రెండుమార్లుకు మించి పనిచేసేందుకు అవకాశం లేదు. దాంతో కొంత విరామం తర్వాత మరో మారు అధ్యక్షుడు అయ్యేందుకు అవకాశాలున్నాయి. బండారు దత్తాత్రేయ గవర్నర్‌గా కొనసాగుతున్నందున, కిషన్‌రెడ్డి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నందున ఈసారి అధ్యక్ష పదవికి పెద్దపోటీలేదని పార్టీ నేతలు చెబుతున్నారు.